యువహీరో నాగశౌర్య నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కిస్తున్న 'అశ్వథ్థామ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు శౌర్య స్వయంగా కథ కూడా అందించడం విశేషం. ఈ సినిమా హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది.
టీజర్ ఆరంభంలోనే వైజాగ్ సముద్రం... నౌకాశ్రయం చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో మార్చురీలో శవాల కాళ్ళకు వేసిన టాగ్స్ ను సుతారంగా మీటుతూ ముందుకు వెళ్తున్న ఒక విలన్ ను వెనక నుంచి చూపిస్తారు. "ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు. వాడికి మాత్రం తెలిసిన ఒక రహస్యం. సైరన్ కూతల కింద పని చేసే వాడి సైన్యం. గమ్యం తెలియని ఒక యుద్ధం. ఆయుద్ధం గెలవాలంటే ఒక ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి. ఒక అశ్వథ్థాముడు రావాలి" అంటూ నేపథ్యంలో వాయస్ ఓవర్. అప్పుడు శౌర్య పవర్ఫుల్ ఎంట్రీ.. ఇక ఫుల్ యాక్షన్.
నగరంలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్.. అదో నెట్వర్క్. ఈ నెట్వర్క్ ను ఛేదించే మిషన్ లో మన హీరో ఉంటాడు. మరి ఆ నెట్ వర్క్ ఎవరు రన్ చేస్తున్నారు. వారు చేసే నేరాలు ఎలాంటివి? ఆ నేరాలను శౌర్య ఎలా అడ్డుకుంటాడు అన్నది సినిమా థీమ్ లాగా అనిపిస్తోంది. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. శౌర్య మ్యాన్లీగా రఫ్ గా కనిపించాడు. సినిమా కథను ఎక్కువగా రివీల్ చెయ్యనప్పటికీ టీజర్ ఆసక్తికరంగా ఉంది. నేపథ్య సంగీతం.. ఛాయాగ్రహణం బాగున్నాయి. ఆలస్యం ఎందుకు.. చూసేయండి ఈ అశ్వథ్థామను.
Full View