నయనతార రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తుందన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు గ్లామరస్‌గా కనిపిస్తుంది. ఉన్నట్టుండి సీతాదేవి పాత్రలో కనిపిస్తుంది. ఆరంభంలో కవ్వించే పాత్రలో ఆకట్టుకున్నా, శ్రీరామరాజ్యంలో సీతమ్మ వారిలా కనిపించినా నయన్‌కే చెల్లింది. ఇలాంటి విలక్షణత ఉంది కాబట్టే నటిగా సుదీర్ఘ ఇన్నింగ్స్‌ని కొనసాగించగలిగింది. ప్రేమలో వైఫల్యం ఈ అమ్మడి కెరీర్‌ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు.
ప్రస్తుతం గ్లామర్‌ని ఆవిష్కరించే పాత్రలకు దూరంగా కాస్త భయపెట్టే పాత్రలోకి పరకాయం చేస్తోంది. డెబ్యూ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో మాయ అనే చిత్రంలో నటిస్తోంది. అయితే ఓ కొత్త కుర్రాడికి ఈ అవకాశం దక్కింది అంటే దానికంటే ముందు చాలా కథే ఉంది. అదేంటో అశ్విన్ మాటల్లోనే వింటే ఆసక్తికరంగా ఉంటుంది. నేను దర్శకుడిని కాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓ కంపెనీలో ట్రైనీగా జాయినయ్యా. కానీ అది నాకు సరైన దారి కాదనిపించింది. అందుకే సినిమా వైపు వచ్చాను. ఇంట్లో రెండేళ్ల పాటు ప్రయత్నించుకో అని ఓ ఛాన్సిచ్చారు. అయితే అది చాలా తక్కువ టైమ్. కానీ ఎలాగోలా తిప్పలు పడ్డాను. ఓ హారర్ కథ రాసుకున్నా. ప్రొడక్షన్ హౌస్‌ని పట్టా.. అని చెప్పుకొచ్చాడు.
తర్వాత కథ ప్రకారం విషయం ఉన్న నాయిక అయితేనే సూటబుల్. అందుకే నయన్‌ని సంప్రదించి ఒప్పించారు నిర్మాతలు. కథ చెప్పాక.. రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానని అన్నారు నయన్. సరిగ్గా రెండో రోజు ఓకే చెప్పేశారు.. అంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పేశాడు శరవణన్. కృష్ణానగర్, ఫిలింనగర్ డైరెక్టర్లూ.. వింటున్నారా? రెండేళ్లలో ఛాన్స్ ఎలా పట్టేయాలో?