మనదేశాన్ని పరిపాలించిన గొప్ప ప్రధానమంత్రుల్లో తప్పనిసరిగా చోటు దక్కించుకునే వ్యక్తి.. అటల్ బిహారి వాజ్ పేయి. బీజేపీకి చెందిన ఆయనను ప్రతిపక్షాలు.. రైట్ మ్యాన్ ఇన్ ద ర్యాంగ్ పార్టీ అని అభివర్ణిస్తుంటాయి. అద్భుత వక్తగా, మృదు స్వభావిగా, కవిగా వాజ్ పేయికి మంచి పేరుంది.
అంతేకాకుండా ప్రధానమంత్రిగా అగ్ర దేశాలను ఆంక్షలను సైతం ధిక్కరించి రాజస్థాన్ లోని ఫోఖ్రాన్ లో అణుపరీక్షలు సైతం నిర్వహించారు. తద్వారా దేశాన్ని గొప్ప అణుపాటవ శక్తిగా నిలిపారు.
దేశానికి అందించిన సేవలకు గానూ అటల్ బిహారి వాజ్ పేయి భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయిన అటల్ బిహారి వాజ్ పేయి జీవితంగా ఆధారంగా బాలీవుడ్ లో బయోపిక్ సినిమా రూపొందుతోంది. ఇందులో అటల్ బిహారి వాజ్ పేయిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠీ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఏ పాత్రను అయినా అలవోకగా పోషించగల నటుడిగా పంకజ్ త్రిపాఠీకి మంచి పేరుంది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కొద్ది రోజుల క్రితం 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును కూడా గెలుచుకున్నాడు. తాజాగా భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి పాత్రకు ఆయన ఎంపికయ్యారు.
'మె రహూ యా నా రహూన్, యే దేశ్ రెహ్నా చాహియే - అటల్' టైటిల్‌తో ఈ బయోపిక్‌ను రూపొందించనున్నారు. ఎన్‌పీ ఉల్లేఖ్ రాసిన 'ది అన్‌టోల్డ్ వాజ్‌పేయి: పొలిటిషియన్ అండ్ పారడాక్స్' పుస్తకం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాను వినోద్ భానుశాలీ, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
2023 ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బీటౌన్ టాక్. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా 2023, డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పంకజ్ త్రిపాఠీ ప్రస్తుతం పాపులర్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' లో నటిస్తున్నాడు. ఈ సిరీస్‌లో కాళీన్ భయ్యా పాత్రను అతడు పోషిస్తున్నాడు.