క్రికెటర్స్ హీరోయిన్స్ తో ప్రేమలో పడటం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చాలా సార్లు చాలా మంది స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ ను ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు మరియు హీరోయిన్స్ జాబిత తీస్తే చాలానే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో స్టార్ క్రికెటర్ రాహుల్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన గత కొంత కాలంగా హీరోయిన్ అతియా శెట్టితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు వీరిద్దరు తమ వ్యవహారాన్ని ఓపెన్ గా ఒప్పుకోలేదు. కాని వీరిద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం నిజమే అనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. కేఎల్ రాహుల్ ప్రస్తుతం థాయిలాండ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అతియా శెట్టితో చాలా క్లోజ్ గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ పార్టీ కోసం ఈ జంట స్నేహితులతో కలిసి థాయిలాండ్ వెళ్లి నట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి 2015వ సంవత్సరంలో హీరో అనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత కూడా వరుసగా చిత్రాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా స్టార్ డం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అతియా శెట్టి ఇప్పట్లో ప్రేమను అధికారికంగా ప్రకటించే ఉద్దేశ్యంతో లేనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అనధికారికంగానే ప్రేమించుకోవాలని.. కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు లవ్ విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పడంతో పాటు పెళ్లి కూడా చేసుకోవాలనే ఆలోచనలో వీళ్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.