బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వారసురాలు ఆతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కె.ఎల్. రాహుల్ డేటింగ్ లో ఉన్నట్లు గత కొంత కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు.. విదేశీ టూర్లకు సంబంధించిన ఫోటోలు ఆ కథనాల్ని మరింత బలపరిచాయి. తమ మధ్య సన్నిహిత్యాన్ని అథియా స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసి పబ్లిగ్గా తమ స్నేహాన్ని రివీల్ చేసింది. రొమాంటిక్ గయ్ గా పేరున్న రాహుల్ -అథియా జంట రిలేషన్ షిప్ అంతకంతకు సినీవర్గాల్ని వేడెక్కించింది. అయితే ఇంత బలంగా పెనవేసిన బంధంలో అలజని మొదలైందని తాజాగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
గతంలో ఇద్దరు కలిసి ఉన్న థాయ్ లాండ్ ఫోటోల్ని షేర్ చేసిన ఆథియా తాజాగా రాహుల్ సోలో ఫోటో కటింగుని షేర్ చేసింది. అంతా కలగా (ఫీల్ లైక్స్ ఏ డ్రీమ్ ఎగో) ఉంది! అంటూ కట్ చేసిన ఫోటోకి ట్యాగ్ చేసింది. దీంతో నెటిజనులు ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయా? విడిపోయారా? అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు. ఫోటోలోనే కట్ చేసావా? రియల్ లైఫ్ లోనూ కట్ చేసావా? అంటూ కామెంట్లు పెడుతు న్నారు. ఇక్కడ మరో సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ని క్రాప్ చేసింది ప్రొఫెషనల్ గా కాదు. చిత్తడి చిత్తడిగా ఇష్టానుసారం రాహుల్ ని కట్ చేసి పక్కకి విసిరేసినట్లు ఆ ఫోటోని చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా. దీంతో ఆ ఇద్ది మధ్యా మనస్ఫర్ధలు తలెత్తాయా? అందుకే ఇలా దూరం జరిగారా? అంటూ బాలీవుడ్ మీడియా సందేహం వ్యక్తం చేస్తోంది.
ఇక రాహుల్ కి రొమాంటిక్ గయ్ అన్న పాపులారిటీ ఉంది. గాళ్స్ తో స్నేహాలు చేయడంలో అతడి తర్వాతనే. `కాఫీ విత్ కరణ్` షోలో రాహుల్ ఎంత మందితో ఏఫైర్లు సాగించాడో పబ్లిక్ గానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దానిపై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫలితంగా క్రికెట్ బోర్డు అతడిని నిషేధించింది. కొన్నాళ్లు పాటు క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వెళ్లే ఛాన్సును కోల్పోయాడు. అతనిలో రొమాంటిక్ యాంగిల్ గురించి ఫ్యాన్స్ కి ఓపెనై పోయింది అలా. ప్రస్తుతం ఆ నిషేధం ఎత్తి వేసినా ఇంకా భామలతో ఆటాడుకుంటున్నాడా? అన్న సందేహం డబుల్ అయ్యింది మరి.