ఐ సినిమాను మామూలుగా చూస్తే జనాలకు బాగానే ఎక్కేదేమో. కానీ ఆ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడం వల్లే మెజారిటీ ప్రేక్షకులు నిరాశ చెందారు. ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటే అది మా తప్పా.. అని శంకర్ అండ్ కో ప్రశ్నించొచ్చు. వాస్తవమే కానీ.. తన సినిమాల విశేషాలు ఎప్పుడూ బయటపెట్టేవాణ్ని కాదని.. కానీ 'ఐ' విషయంలో మాత్రం చాలా విషయాలు రివీల్ చేయడంతో జనాల్లో అంచనాలు పెరిగాయని శంకరే ఒప్పుకున్నాడు. ఐతే మిగతా విషయాలన్నీ సరే కానీ.. ప్రేక్షకులు ఐ విషయంలో ఎక్కువ నిరాశ చెందింది.. విక్రమ్ వేసిన మృగం క్యారెక్టర్ విషయంలోనే.
'ఐ'కి సంబంధించి ముందుగా విడుదలైన పోస్టర్లలో ఈ మృగం పోస్టర్ ఒకటి. ఆడియో ఫంక్షన్లో సైతం విక్రమ్ ఈ అవతారంలోనే అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఈ క్యారెక్టర్‌కి సంబంధించి ఓ పాట కూడా రిలీజ్ చేయడం.. లీక్ చేసిన స్టోరీలోనూ ఈ మృగం క్యారెక్టర్‌కు సంబంధించి ఏదో పెద్ద విశేషముందని చర్చ జరగడంతో దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కురూపి తర్వాత విక్రమ్ మృగంలా మారిపోతాడని.. ఆ పాత్ర నేపథ్యంలోనే క్లైమాక్సు కూడా ఉంటుందని జనాలు ఆశించారు. కానీ ఆ క్యారెక్టర్ ఓ పాటకు సంబంధించిన ఊహ మాత్రమే అని తేలిపోవడంతో జనాలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ప్రేక్షకులు 'ఐ' విషయంలో ఎక్కువ హర్టయింది ఇక్కడే. అందుకే సినిమా డివైడ్ టాక్‌తో మొదలైంది.