అవసరాల శ్రీనివాస్ మంచి నటుడే కాదు.. టాలెంటెడ్ డైరెక్టర్ కూడా. అతడి డైరెక్షన్ లో వచ్చిన ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద సినిమాలు అతడిలోని దర్శకత్వ ప్రతిభకు.. అభిరుచికి అద్దం పడతాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టెయినర్లుగా వచ్చిన సినిమాలు కమర్షియల్ గానూ సక్సెస్ సాధించాయి. జ్యో అచ్యుతానంద తరవాత బాగా గ్యాప్ తీసుకుని మళ్లీ ఫిబ్రవరి నుంచి డైరెక్టర్ సీట్లో కూర్చుంటున్నాడు.
అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలూ రెండు సినిమాలూ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినవే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాక ఎవరైనా స్టార్లతో సినిమా తీయాలని భావిస్తారు. అవసరాల శ్రీనివాస్ మాత్రం స్టార్ల సినిమాను డైరెక్ట్ చేయడం తనవల్ల అయ్యే పని కాదంటున్నాడు. అప్పటికీ ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుని కథ కూడా చెప్పానంటున్నాడు. ఆ హీరోయేమో అలా మార్చండి.. ఇలా సెట్ చేయడం అంటూ కొన్ని సజెషన్స్ చెప్పాడట. అవన్నీ చెయ్యలేక ఆ ప్రాజెక్టునే పక్కన పెట్టేశానని చెప్పుకొచ్చాడు. ‘స్టార్ హీరోలతో సినిమా చేయాలంటే ముందు స్టోరీ చెప్పి ఒప్పించాలి. ఆ తరవాత వాళ్లు చెప్పినట్టల్లా స్క్రీన్ ప్లే మార్చుకుంటూ రావాలి. చాలాసార్లు డేట్లు దొరకవు. నాకా సర్దుకుపోయే తత్వం అంతగా లేదు. ఎందుకు ఇన్ని ప్రాబ్లెమ్స్ అని స్టార్లతో సినిమా గురించి ఆలోచించడం లేదని’’ అని తన మనసులో మాట చెప్పుకొచ్చాడు అవసరాల శ్రీనివాస్.
ఈ మధ్య ఒక పెద్ద హీరో అవసరాల శ్రీనివాస్ చెప్పిన కథను ఓకే చేశాడు. అయితే దానిని తాను డైరెక్ట్ చేయడం లేదని.. ఓన్లీ స్టోరీ రైటర్ గానే ఉంటానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం డైరెక్ట్ చేస్తున్న మూడో సినిమా కూడా ముందు రెండు మూవీల్లాగే డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. డైరెక్టర్ గా ఓ ఆర్ట్ సినిమా తీయాలన్నది తన డ్రీమ్ అని.. ఎప్పటికైనా తీస్తానంటున్నాడు.