క‌రోనాతో అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే వీళ్ల‌ ఆధిప‌త్యం గోలేంటి?

Update: 2020-03-28 02:30 GMT
ప్ర‌పంచాన్ని #క‌రోనా ఒణికిస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ గురించి త‌ప్ప ఇంకే టాపిక్ గురించి మాట్లాడేందుకు ఎవ‌రూ ఆస‌క్తిగా లేరు. ఇక వినోద ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా పిడుగు పాటు క‌ల్లోలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ  వైర‌స్ మ‌హ‌మ్మారీ నుంచి ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టేట్టు ఉంది. ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్ లో ఇక సినిమాల రికార్డుల గురించి మాట్లాడే వీల్లేదు.

అదంతా అటుంచితే.. క‌నీసం ఈ విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక అయినా రికార్డుల గురించి ముచ్చ‌టిస్తామా? అంటే.. జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చే వీలుంటుందా?  ఆర్నెళ్ల వ‌ర‌కూ స‌ర్థుకునే పరిస్థితి ఉంటుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక‌పోతే అన్నీ స‌ర్థుకుంటే మాత్రం మ‌ళ్లీ రికార్డుల మాట వినిపిస్తుంది.

ఇక ప్ర‌స్తుతం ప‌లు హాలీవుడ్ వెబ్ సైట్ల క‌థ‌నాల ప్ర‌కారం.. అవతార్ వ‌ర్సెస్ ఎవెంజర్స్: ఎండ్ గేమ్ .. అంటూ కొన్ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. బాక్సాఫీస్ వద్ద మళ్ళీ జేమ్స్ కామెరూన్ చిత్రం అవ‌తార్ రికార్డులు తిర‌గ‌రాస్తుందా? అన్న చ‌ర్చా సాగుతోంది. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ అంత‌కుముందు ఉన్న రికార్డులన్నిటినీ చెరిపేస్తూ 2.798 బిలియన్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టికి ప్ర‌పంచంలోనే నంబ‌ర్ 1 సినిమాగా నిలిచింది. ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల నుంచి సునామీ వ‌సూళ్ల‌ను సాధించింది. హై-ఎండ్ సాంకేతికతతో విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఫ్రాంఛైజీ ఫ్యాన్స్ భావోద్వేగాల‌తో ముడిప‌డిన‌దిగా విమ‌ర్శ‌కులు విశ్లేషించారు.  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన అవతార్ ను లాంగ్ ర‌న్ వ‌సూళ్ల‌లో అధిగ‌మించి సెన్సేష‌న్ సృష్టించింది. జేమ్స్ కామెరాన్ అవతార్ 2.744 బిలియన్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో రెండో స్థానానికి దిగిపోయింది.

తాజా స‌న్నివేశం చూస్తుంటే.. కరోనావైరస్ మహమ్మారి తగ్గింది అని చైనా ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డ తిరిగి కామెరూన్ అవ‌తార్ స‌హా అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ చిత్రాల్ని రీరిలీజ్ కి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. థియేటర్లు తెరిచే స‌మ‌యానికే అవ‌తార్- ఎండ్ గేమ్ చైనాలో విడుదలవుతాయ‌ని చెబుతున్నారు. అయితే ఈ రీరిలీజ్ ఎందుకు? అంటే... బాక్సాఫీస్ హోరాహోరీలో స‌త్తా చాటేందుకు అంట‌! 2009-2010లో జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన అవ‌తార్ ఆ సమయంలో 202 మిలియన్ డాల‌ర్లు సంపాదించగా.. ఎండ్‌గేమ్ చైనా బాక్సాఫీస్ వద్ద 619 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడు తిరిగి వ‌సూళ్ల‌ను పెంచుకోవ‌డం ద్వారా.. మ‌రోసారి పోటీప‌డాల‌ని ఆధిప‌త్యం చాటుకోవాల‌నే ఉద్ధేశంతోనేన‌ట‌!!  దీనికోసం మార్వ‌ల్ .. కామెరూన్ పోటీప‌డ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.
Tags:    

Similar News