ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ సంచలనాల గురించే ముచ్చట సాగుతోంది. అమెరికా.. చైనా.. ఇండియా.. కెనడా మార్కెట్లలో `ఎండ్ గేమ్` బాక్సాఫీస్ హవా గురించి.. రికార్డుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అమెరికాలో 350 మిలియన్ డాలర్లు.. చైనాలో 329 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం ఇండియాలోనూ రికార్డ్ స్థాయి వసూళ్లను సాధించింది.
తాజా సమాచారం ప్రకారం `అవెంజర్స్ - ఎండ్ గేమ్` భారతదేశంలో ఏకంగా 187 కోట్లు (26.7 మిలియన్ డాలర్లు) వసూలు చేసి 200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇండియాలో ఓ హాలీవుడ్ చిత్రానికి ఇది రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్. 121 కోట్లతో బాహుబలి- 2 భారతదేశంలోనే నంబర్ -1 ఓపెనర్ గా నిలిస్తే .. ఆ తర్వాతి స్థానంలో `అవెంజర్స్ - ఎండ్ గేమ్` 53 కోట్ల వసూళ్లతో డే1 రికార్డులకెక్కింది. అమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ (2018) ఓపెనింగ్ రికార్డు 52.25కోట్లను బ్రేక్ చేసింది ఈ చిత్రం. ఇక `అవెంజర్స్ -ఇన్ ఫినిటీ వార్` (అవెంజర్స్ 3) చిత్రం భారతదేశంలో తొలి వీకెండ్ మూడు రోజుల్లో 120.90 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును `ఎండ్ గేమ్` బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
`అవెంజర్స్- ఎండ్ గేమ్` మార్వల్ సినిమాటిక్ యూనివర్శ్ (ఎంసీయు)లో 22వ సినిమా. ఈ చిత్రం భారతదేశంలో ఏకంగా 2845 థియేటర్లలో రిలీజైంది. తెలుగు - హిందీ- తమిళం సహా అన్ని భారతీయ భాషల్లోనూ రిలీజైంది. ఆంగ్ల వెర్షన్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రోబర్ట్ డౌనీ జూనియర్.. క్రిస్ ఇవాన్స్.. మార్క్ రఫెలో.. క్రిస్ హేమ్స్ వర్త్.. స్కార్లెట్ జాన్సన్.. బ్రాడ్ లీ కూపర్.. జోష్ బ్రాలిన్ వంటి టాప్ స్టార్లు సూపర్ హీరోలుగా నటించారు. ప్రఖ్యాత రోటెన్ టమోటాస్ ఏకంగా 96 % రేటింగ్ తో హైలైట్ చేయడం ప్రపంచవ్యాప్త వసూళ్లకు పెద్ద బూస్ట్ ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం తొలి వీకెండ్ నాటికే 200 కోట్ల క్లబ్ లో అడుగుపెడుతున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో భారతదేశం నుంచి 500కోట్లు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.7000 కోట్లు.. ఫుల్ రన్ లో రూ.14000 కోట్లు వసూలు చేస్తుందన్న అంచనాలు ఏర్పడ్డాయి.