తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’ సూపర్ హిట్.. రెండో సినిమా ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ఓ మోస్తరుగా ఆడింది. మూడో సినిమా ‘సినిమా చూపిస్త మావ’ సూపర్ హిట్. చివరగా నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ బ్లాక్ బస్టర్. ఇదీ తెలుగులో కథానాయికగా అవికా గోర్ ప్రస్థానం. ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నా కూడా అవికాకు ఇక్కడ అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మంచి పెర్ఫామర్ అయినప్పటికీ.. ఆమె సినిమాలు బాగా ఆడినప్పటికీ ఫిజిక్ విషయంలో కేర్ తీసుకోకపోవడంతో ఆమె మీద టాలీవుడ్ జనాల్లో నెగెటివ్ ఫీలింగ్ పడిపోయింది. ఆమెకు కొందరు కావాలనే అవకాశాలు రాకుండా చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఐతే కారణమేదైనప్పటికీ ఏడాదిగా అవికాకు ఇక్కడ ఛాన్సుల్లేవు. మాతృ భాష హిందీలో సైతం ఆమెకు సినిమాలేవీ దక్కలేదు. దీంతో తనకు ముందు గుర్తింపు తెచ్చిపెట్టిన బుల్లితెరనే నమ్ముకుంటోందట అవికా. ‘బాలికా వధు’ సీరియల్ తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అవికా.. ఇప్పుడు ‘లాడా-2’ సీరియల్లో నటించేందుకు సిద్ధమైంది. హిందీలో ఒక సీరియల్ కమిటైతే కొన్నేళ్ల పాటు సాఫీగా బండి లాగించేయొచ్చు. ఇలా రెండు మూడు సీరియళ్లలో నటిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసి నిరాశ చెందడం కన్నా తనకు అచ్చొచ్చిన బుల్లితెరనే నమ్ముకుని జీవితంలో స్థిరపడదామని అవికా ఫిక్సయిందట. కాబట్టి మున్ముందు అవికా సినిమాల్లో కనిపించడం కష్టమేనేమో.