నిన్న హీరోయిన్.. నేడు హీరో.. మా బంధం ఇదే!

Update: 2021-06-24 17:30 GMT
తెలుగులో వ‌చ్చిన 'చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ మహిళా ప్రేక్షకులను ఎంత‌గా ఆకట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ సీరియ‌ల్ లో చిన్నారిగా న‌టించిన అవికా గోర్ స్టార్ గా మారిపోయింది. ఇప్ప‌టికీ ఆమె ఒరిజిన‌ల్ పేరు చాలా మందికి తెలియ‌దు. చిన్నారి పెళ్లి కూతురు అంటే మాత్రం గుర్తు ప‌ట్టేస్తారు. అయితే.. ఈ బ్యూటీ సీక్రెట్ ఎఫైర్ న‌డిపిస్తోంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ హిందీ డబ్బింగ్ అనే సంగతి తెలిసిందే. ఈ సీరియ‌ల్ త‌ర్వాత 'ససురాల్ సిమర్ కా' అనే మ‌రో సీరియ‌ల్ లోనూ న‌టించింది. ఇందులో మ‌నీశ్ రాయ్ సింఘ‌న్ తో క‌లిసి ప‌నిచేశారు. అయితే.. ఈ సీరియ‌ల్ కోసం వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలోనే వీరిద్దరి మ‌ధ్య వ్య‌వ‌హారం న‌డించింద‌ని, ఓ బిడ్డ‌కు సైతం జ‌న్మ‌నిచ్చార‌ని తెగ ప్ర‌చారం సాగింది.

ఈ విష‌య‌మై తాజాగా.. ముంబై మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది అవికా గోర్. ''మ‌నీష్ కు, మీకు మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌నే ప్ర‌చారం నిజ‌మేనా'' అన్న ప్రశ్నకు ఆమె స్పందించారు. అది నిజం కానే కాద‌ని, అందుకు అవ‌కాశ‌మే లేద‌ని చెప్పింది. ఆయ‌న త‌న‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు తేడా ఉంద‌ని, ఆయ‌న త‌న తండ్రి వ‌య‌సు వాడ‌ని తెలిపింది అవికా. మ‌నీశ్ త‌న‌కు స్నేహితుడ‌ని, ఆయ‌న్నుంచి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపింది. ఇలాంటి వార్త‌లు తాను కూడా గ‌తంలో చ‌దివాన‌ని, ఏకంగా బిడ్డ కూడా ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింద‌ని చెప్పింది. తొలినాళ్ల‌లో ఈ వార్త‌లు విని చాలా బాధ‌ప‌డ్డాన‌ని, ఆ త‌ర్వాత ప‌ట్టించుకోవ‌డం మానేసిన‌ట్టు చెప్పింది.

అయితే.. ఇవాళ మనీష్ స్పందించాడు. అవికా తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనన్న మనీష్.. ఆడ‌-మ‌గ స్నేహంగా ఉంటే ఎందుకు త‌ట్టుకోలేరు అంటూ.. గాలి బ్యాచ్ కు చుర‌క‌లు అంటించారు. అవికా త‌న‌కంటే వ‌య‌సులో 18 సంవ‌త్స‌రాలు చిన్న‌ద‌ని చెప్పారు. అంతేకాదు.. త‌ను మిలింద్ చంద్వాణీతో డేటింగ్ లో ఉంద‌ని, వాళ్ల జీవితం కూడా సంతోషంగా ఉంద‌ని చెప్పాడు. మొత్తానికి ఇద్ద‌రూ ఒకేసారి ఈ రిలేష‌న్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు. మ‌రి, ఇక‌నైనా ఈ గాలి వార్త‌ల‌కు ఫుల్ స్టాప్ ప‌డుతుందేమో చూడాలి.
Tags:    

Similar News