రెండేళ్ళ గ్యాప్ తర్వాత రెండు ప్రాజెక్టులు లైన్లో?

Update: 2019-04-27 01:30 GMT
టీవీలో 'బాలిక వధు' సీరియల్ తో భారీ పాపులారిటీ సాధించిన అవిక గోర్' ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో రాజ్ తరుణ్ కు కూడా అదే డెబ్యూ ఫిలిం.  మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించిన ఈ జంట మరోసారి కలిసి నటిస్తోందని సమాచారం.

రీసెంట్ గా రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా అవికా గోర్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది.  తెలుగులో అవిక నటించిన లాస్ట్ ఫిలిం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఆ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ళు నటనకు దూరంగా ఉన్న అవిక ఇప్పుడు మళ్ళీ వెండితెరపై కనిపించేందుకు రెడీ అయింది.  గతంలో చబ్బీగా కనిపించిన ఈ భామ ఇప్పుడు ఫిట్నెస్ ఫ్రీక్ గా మారి రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేస్తూ స్లిమ్ గా.. ఫిట్ గా మారింది.

రాజ్ తరుణ్ సినిమా ఒక్కటే కాకుండా డైరెక్టర్ మారుతి- మెగా హీరో సాయి తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా హీరోయిన్ గా అవికా పేరును పరిశీలిస్తున్నారని టాక్.  ఈ రెండు ప్రాజెక్టులు ఫైనలైజ్ అయితే అవికా మళ్ళీ టాలీవుడ్ లో జోరుగా దూసుకుపోవడం ఖాయం
Tags:    

Similar News