ఒక్క హిట్ పడితే చాలు విపరీతమైన ఫాలోయింగ్.. డిమాండ్ చేసినంత డబ్బు వచ్చి పడతాయ్ ఇంకేముంది హీరోయిన్స్ లైఫ్ సెటిల్.. ముద్దు గుమ్మలు ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటారు చాలామంది. కానీ వాస్తవం మరోలా ఉంటుంది. సక్సెస్ వెనకే కష్టాలు కూడా ఉంటాయ్. కొంతమంది హ్యాండిల్ చేయగలరు.. మరికొంతమంది ఒత్తిడి తట్టుకోలేరు. ఎక్స్ ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే వాళ్లు కొందరైతే.. సైలెంట్ గా సైడ్ అయిపోయే వాళ్లు ఇంకొందరు. ఇప్పుడు అవికాగోర్ ఇలాంటి నిర్ణయమే తీసుకుందని వినిపిస్తోంది.
బాలికా వధూ అంటూ దేశమ్మొత్తం.. చిన్నారి పెళ్లి కూతురిగా తెలుగునాట సూపర్ పాపులరైంది అవికా గోర్. చేసిన సినిమాల్లోనూ దాదాపు చెప్పుకోతగ్గ విజయాలే ఉన్నాయ్. సక్సెస్ ఉంది కానీ ప్రశాంతత లేకపోయే సరికి అవికా తట్టుకోలేపోతుందట. అందుకే సినిమాలకి బ్రేక్ ఇచ్చేయాలనే నిర్ణయం తీసుకొందని ఆమె సన్నిహితులంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఓ తెలుగు హీరో అవికాకి అసభ్యంగా మేసెజ్ లు పెట్టడం.. దాని మీద యంగ్ హీరో- హీరోయిన్స్ రెండు వర్గాలుగా విడిపోవడం.. ఫైనల్ గా అవికాదే తప్పు అన్నట్టు కావాలని ఈ హీరోయిన్ ని వాట్సాప్ గ్రూప్ నుంచి బయటికి పంపడం అవికాని తీవ్రంగా బాధపెట్టాయట. ఆ సమయంలోనే తెలుగు సినిమాలు చేయకూడదని అవికా నిర్ణయం తీసుకుందని వినిపించింది. కానీ ఇప్పుడు టోటల్ గా సినీ ఇండస్ట్రీకే దూరంగా ఉండాలని భావిస్తుందట.
బ్రేక్ తీసుకోని కెరీర్ ను కంటిన్యూ చేయాలో డిసైడ్ చేసుకోని వద్దు అనుకుంటే తన సొంతూరు గుజరాత్ వెళ్లి సెటిల్ అవడమో.. వేరే జాబ్ చేసుకోవడమో బెటర్ అనుకుంటుందట. ఆఫర్స్ లేనప్పుడు ఇలాంటి నిర్ణయమంటే ఓకే కానీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ఇలాంటి డెసిషన్ అంటే అవికా చాలా హర్ట్ అయిందనే అనుకోవాలి. మరి జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/