చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో బాలనటిగా పరిచయం అయ్యింది అవికాగోర్. ఆ డబ్బింగ్ సీరియల్ తెలుగు వాళ్లకు కూడా తెగ నచ్చేసింది. దీంతో ఆమెకు పదిహేనేళ్లు రాగానే హీరోయిన్గా పెట్టి సినిమా తీసేశారు అన్నపూర్ణ ప్రొడక్షన్ వాళ్లు. అదే ఉయ్యలా జంపాలా సినిమా. అందులో కూడా అవిక సింపుల్ గా అందంగా మెరిసింది. ఇక అక్కణ్నించి వరుస సినిమాలు ఒప్పుకుంది. కానీ హఠాత్తుగా తెలుగు తెరను వదిలేసి వెళ్లిపోయింది.
ఉయ్యాల జంపాల హిట్ తో సినిమా చూపిస్త మావ లక్ష్మీ రావే మా ఇంటికి ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాలలో నటించింది. తమిళ మలయాళం నుంచి కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తరువాత ఆమె తెలుగు తెరపై మెరవలేదు. అంతేకాదు టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో ఆమెను వేధిస్తున్నట్టు తెలిసింది. అసభ్య మెసేజ్‌లలో నరకం చూపించాడని కూడా సమాచారం. తను నేను సినిమాలో నటిస్తున్నప్పుడు కూడా ఒక యాక్టర్ తో ఆమెకు పొసగలేదని ఆ సినిమా ఆపేయమని నిర్మాతను ఆమె కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంతవరకు అయిన ఖర్చుని తానే భరిస్తానని కూడా అడిగిందట. హీరోయిన్లతో కొందరు హీరోల బిహేవియర్ ఆమెకు నచ్చక సినిమాలకు గుడ్ బై చెప్పిందని వార్తలు వచ్చాయి. దీనిపై అధికారికంగా మాత్రం ఆమె ఏమీ ప్రకటించలేదు. కాగా ఇప్పుడు మళ్లీ ఆ బ్యూటీ రీ ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం.
వారాహి వారు త్వరలో ఓ ఫిమేట్ సెంట్రిక్ సినిమాను తీయబోతున్నారట. అందులో నటించడానికి అవికాను సంప్రదించారని ఆమె కూడా నటించడానికి ఒప్పుకుందని టాక్. వారాహి వారు అధికారికంగా ప్రకటించే వరకు అవికా రీఎంట్రీపై సందేహాలు అలానే ఉంటాయ్. అవికా కూడా మనసు మార్చుకుని మళ్లీ తెలుగు తెరపై మెరవాలని కోరుకుందాం.