‘సూపర్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిన ఆయేషా టకియా గుర్తుందిగా. ఈ మధ్యే పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందాన్ని దెబ్బ తీసుకుందంటూ ఆమె గురించి వార్తలు హల్ చల్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి వచ్చింది. హిందువు అయిన ఆయేషా మహారాష్ట్రకు చెందిన ముస్లిం ఎమ్మెల్యే అబు అజ్మి కొడుకైన ఫర్హాన్ అజ్మిని 2009లో పెళ్లాడింది. వీళ్లిద్దరికీ ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఐతే వాళ్లిద్దరి పెళ్లయి ఇన్నేళ్లు గడిచాక.. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా.. నిన్నుచంపేస్తాం అంటూ ‘హిందు సేన’ అనే సంస్థ నుంచి అతడికి బెదిరింపులు రావడం గమనార్హం.
‘‘మీరు జంతువులు.. హిందూ అమ్మాయిని పెళ్లాడటం ద్వారా ‘లవ్ జిహాదీ’కి పాల్పడ్డావని మరిచిపోయావా’’ అంటూ హిందు సేన కార్యకర్తగా చెప్పుకున్న ఓ వ్యక్తి తనను బెదిరించినట్లుగా ఫర్హాన్ అజ్మి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫర్హాన్ తండ్రి అబు అజ్మికి వివాదాస్పదుడిగా పేరుంది. అతను తరచూ కాంట్రవర్శల్ కామెంట్స్ చేస్తుంటాడు. ఇటీవలే ముస్లింలు తెల్లవారుజామున చేసే ప్రార్థనపై విమర్శలు చేసిన గాయని సుచిత్ర కృష్ణమూర్తిపై మండి పడ్డాడు. దీనిపై హిందూ సంస్థలు అతడిపై మాటల దాడికి దిగాయి. ఈ క్రమంలోనే ఫర్హాన్ కు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అబు అజ్మి ఏ వివాదాస్పద వ్యాఖ్య చేసినా.. వాటికి తనతో ముడిపెట్టి తనను కూడా టార్గెట్ చేస్తుండటం ఆయేషాకు ఇబ్బందిగా మారుతోంది.