ఎండల సీజన్ లో దంగల్ ప్లాన్ చేస్తున్నారు కొందరు. ఈ `ఏప్రిల్ - మే- జూన్` ఎండల సీజన్ లో టాలీవుడ్ లో డజను పైగా సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి తోడు తాజాగా ఈ దంగల్ రేస్ లోకి సూర్య, విశాల్ కూడా వచ్చారు. ఈ ఇద్దరూ ఎంతో మనసు పెట్టి నటిస్తున్న క్రేజీ సినిమాలు రిలీజ్ లకు వస్తున్నాయి. సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న ఎన్‌జీకే, విశాల్ హీరోగా నటిస్తున్న `అయోగ్య` (టెంపర్ రీమేక్) రిలీజ్ వార్ లోకి వచ్చాయి. ఎన్‌జీకే ఈద్ కానుకగా జూన్ 5 లేదా 6 తేదీల్లో రిలీజవుతుంటే, అయోగ్య ఏప్రిల్ 19న రిలీజవుతోంది.
ఇకపోతే ఈ చిత్రాల్లో విశాల్ అయోగ్య కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే ట్రీటిస్తుంటే, సూర్య ఎన్ జీకే అటు తమిళం, ఇటు తెలుగు ఆడియెన్ కి ట్రీట్ ఇచ్చేందుకు వస్తోంది. సూర్యకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఎన్ జీకే చిత్రాన్ని భారీ హైప్ తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. సూర్య ఈ చిత్రంలో ఓ విప్లవకారుడైన విద్యార్థిగా కనిపించనున్నాడు. ఇది వరకూ రిలీజైన పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. సూర్య మాస్ అవతారానికి చక్కని గుర్తింపు దక్కింది. అలాగే విశాల్ బ్యాడ్ కాప్ లుక్ ఇది వరకూ రిలీజై ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లింది. అయితే ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయొద్దు అనుకోవడానికి కారణం ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో విశాల్ స్వయంగా చెప్పారు. `పందెంకోడి 2` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అభిమానులు పోలిక చెబుతారు. ఎన్టీఆర్ లా నేను నటించలేదని అంటారు. అందుకే ఇక్కడ రిలీజ్ చేయలేమని విశాల్ ఓపెన్ గానే చెప్పారు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగు కుర్రాడైన విశాల్ తొందర్లోనే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తమిళనాడులో నడిగర సంఘం సొంత బిల్డింగ్ నిర్మించి ఆ తర్వాతే పెళ్లాడతానన్న విశాల్ అందుకోసం సన్నాహకాల్లో ఉన్నారన్న మాటా వినిపిస్తోంది. సుందర్ .సి దర్శకత్వంలో సినిమాతో పాటు, పందెంకోడి సిరీస్ లో సినిమాలకు విశాల్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సూర్య ప్రస్తుతం ఎన్ జీకే ప్రమోషన్స్ పై మాత్రమే దృష్టి సారించారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.