ట్రైలర్ టాక్: అజార్ అసలు కథంతా ఉంది

Update: 2016-04-03 03:56 GMT
మహమ్మద్ అజారుద్దీన్.. భారతీయ క్రికెట్ లో ఈ పేరు ఒక సంచలనం. అరంగేట్రంలోనే ఎన్నో రికార్డులు సాధించి, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ గా ఎదిగిన అజారుద్దీన్ పై.. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ మూవీ రూపొందుతోంది. అజార్ అనే టైటిల్ పై తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

అజారుద్దీన్ రియల్ లైఫ్ స్టోరీని అచ్చుగుద్దినట్లు దింపేశాడు దర్శకుడు టోనీ డిసౌజా. ట్యాలెంటెడ్ క్రికెటర్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ సూపర్ గా సెట్ అయ్యాడు. నిజంగానే అజారుద్దీన్ ని చూసినట్లుగా అనిపించేలా తన బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసుకోవడం విశేషం. ఇక క్రికెట్ ఫీల్డ్ లో అరంగేట్రం, అనతి కాలంలోనే ఎదగడం, నౌరీన్ తో తొలి వివాహంతో పాటు.. సినీ స్టార్ సంగీతా బిజిలానీతో ప్రేమాయణం-పెళ్లి ఇలా అజార్ జీవితం అంతా చూపిస్తుండడం విశేషం.

వీటన్నిటితో పాటు కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉండగా.. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుపోయి.. గ్రౌండ్ కి దూరం కావడం కూడా అజార్ చిత్రంలో భాగమే. ఇక ఈ సినిమాలో అజార్ తొలి భార్యగా ప్రాచీ దేశాయ్, రెండో భార్యగా నర్గీస్ ఫక్రీ నటించారు.
Full View

Tags:    

Similar News