టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడో కొత్త చర్చ మొదలైంది. భారీ కథనం.. అంతకు మించిన భారీ తారాగణం లాంటి మాటలు.. అందుకు తగ్గట్లే భారీ బడ్జెట్ తో సినిమా తీయటం.. తీరా విడుదలయ్యాక తుస్ మనటం లాంటివి ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. ఇలాంటివేళ.. అత్యంత తక్కువ బడ్జెట్ లో బూతునే ప్రధానాంశంగా నమ్ముకొని.. ఎంత కుదిరితే అంత బూతును యదేచ్ఛగా వాడేసి సినిమా చుట్టేసి.. జనం మీద వదిలేస్తే.. జోరు కలెక్షన్లను రాబడుతున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఆ మధ్యన గుంటూరు టాకీస్ పేరుతో సినిమాకు వచ్చిన బూతు హైప్ ఆ సినిమాకు ఎంత కలెక్షన్లు తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఏడు చేపల కథ పేరుతో తీసిన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పాలి.
‘‘మా సినిమా మంచి కథ.. కథనంతో నిర్మించాం. వినూత్నంగా నిర్మించిన మా సినిమా సరికొత్త సంచలనం.. ట్రెండ్ సెట్టర్’’ లాంటి పులిహార కబుర్లు తాము చెప్పమని.. తాము తీసింది పక్కా బూతుసినిమా అని నిర్మొహమాటంగా చెప్పేయటమే కాదు.. బూతును ఎంజాయ్ చేయాలంటే తమ మూవీ చూడాలని రోటీన్ కు భిన్నమైన కాన్సెప్ట్ తో సినిమాను ప్రమోట్ చేసిన దర్శక నిర్మాతల చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
భారీని పక్కన పెట్టేసి.. ఎంచక్కా బూతును నమ్ముకొని సింఫుల్ బడ్జెట్ తో కిరాకు పుట్టించే మసాలా సినిమా తీసి జనం మీదకు వదిలితే.. నా సామిరంగా వసూళ్లే వసూళ్లు అన్న చర్చ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త తెగులుగా మారుతుందనటంలో సందేహం లేదు. ఈ బూతు చర్చ రానున్న రోజుల్లో మరెంత రచ్చ చేస్తుందో చూడాలి.