బాహుబలి ది బిగినింగ్ భారీ సక్సెస్ తర్వాత.. దీని సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్ ను మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. తొలి భాగం మాదిరిగా నిర్మాణంలో ఆలస్యం వంటివి లేకుండా.. పక్కా ప్లానింగ్ తో బాహుబలి2 చిత్రీకరణ జరుగుతోంది. 2017 ఏప్రిల్ 14న బాహుబలి ది కంక్లూజన్ విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పేశారంటే.. ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్ధమవుతుంది.
ఇప్పుడు రాజమౌళితో పోటీ పడేందుకు రోబో2 అంటూ రజినీకాంత్ మూవీని తెస్తున్నాడు దర్శకుడు శంకర్. 2.0 అనే టైటిల్ పై తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ ని కూడా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14నే విడుదల చేయాలని నిర్ణయించాడట శంకర్. అదే డేట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం.. ఏప్రిల్ 14 న తమిళుల ఉగాది కావడమే. బాహుబలి2 తో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని తెలిసినా.. ఈ విషయంలో శంకర్ ఏ మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది.
రోబో 2.0 కోసం శంకర్ దాదాపు 350 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నాడు. మరోవైపు బాహుబలి 2 కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. అంటే ఒకే రోజున 550 కోట్ల బడ్జెట్ కి భవిష్యత్తు తేలాల్సి ఉంటుందన్న మాట. ఇదే జరిగితే, రెండు సినిమాలకు నష్టం తప్పదని, హిట్ టాక్ వచ్చినా భారీగా కలెక్షన్స్ కోల్పోవాల్సి వస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. 2-3 వారాల గ్యాప్ లేకుండా ఇంతటి భారీ సినిమాలు విడుదల కావడం కరెక్ట్ కాదన్నది వీరి వాదన.