బాహుబలి ది బిగినింగ్ తో మొదలైన సంచలనాలు.. బాహుబలి ది కంక్లూజన్ తో పీక్ స్టేజ్ కి చేరాయి. వసూళ్ల విషయంలో ఇండియా రికార్డ్ సృష్టించేసిందీ సినిమా. కేవలం తెలుగు వెర్షన్ వరకే వసూలు చేసిన లెక్కలు చూసినా.. ఇప్పట్లో ఈ రికార్డులను అందుకోవడం సాధ్యమేనా అనిపించక మానదు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బాహుబలి ది కంక్లూజన్ ఫుల్ రన్ లో రూ. 197.3 కోట్లను వసూలు చేసి.. 200 కోట్ల మార్కుకు అతి దగ్గరలో ఆగింది. నైజాం నుంచి బాహుబలి2 66.60 కోట్లను వసూలు చేయగా.. సీడెడ్ నుంచి 34.75 కోట్లు.. నెల్లూరు 8.05 కోట్లు,.. గుంటూరు 18.05 కోట్లు.. కృష్ణా 14.05 కోట్లు.. వెస్ట్ 12.3 కోట్లు ఈస్ట్ 17 కోట్లు.. ఉత్తారంధ్ర 26.5 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 197.3 కోట్లు వసూలు కాగా.. కర్నాటకతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రూ. 51.4 కోట్లు వసూలు కాగా.. ఓవర్సీస్ నుంచి రూ. 60.70 కోట్లను కొల్లగొట్టింది బాహుబలి 2.
ఇండియాలోనే బాహుబలి2 తెలుగు వెర్షన్ 248.7 కోట్లను వసూలు చేయగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ. 309.4 కోట్లుగా నమోదైంది. ఇక బాహుబలి తొలి భాగం అయితే.. దేశవ్యాప్తంగా రూ. 149.15 కోట్ల షేర్ ను వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఇది రూ. 183.65 కోట్లుగా ఉంది.
అంటే బాహుబలి సిరీస్ రెండు భాగాలు కలిపి కేవలం తెలుగు వెర్షన్ కే ప్రపంచవ్యాప్తంగా రూ. 493.05 కోట్లను రాబట్టగలిగిందన్న మాట. వీటిలో ఏ రికార్డును అయినా సరే.. ఇప్పట్లో టచ్ చేయడం కష్టమే సుమీ.