17 రోజుల్లో.. 1340 కోట్లు నాట్ ఔట్

Update: 2017-05-16 07:11 GMT
ఇప్పుడు బాహుబలి 2 ఎంత వసూలు చేసింది అని ఎవ్వరూ అడగట్లేదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ అన్ని రికార్డులను బద్దలు కొట్టేసేంత వసూలు చేసేసింది. ఇప్పుడందరూ కూడా ఈ సినిమా ఏ రికార్డు క్రియేట్ చేసింది. కొత్తగా ఏం చేసింది.. అనే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి అసలు బాహుబలి ప్రస్తుత రన్ ఎలా ఉందో చూద్దాం పదండి.

17 రోజుల నుండి నిర్విరామంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపిస్తున్న బాహుబలి 2.. ఏకంగా 1340 కోట్ల గ్రాస్.. అంటే షుమారుగా 668+ కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 170 కోట్ల షేర్ (255 కోట్ల గ్రాస్) వసూలు చేయగా.. కర్ణాటక నుండి 44 కోట్లు (95 గ్రాస్).. తమిళనాడు నుండి 56 కోట్లు (106 కోట్ల గ్రాస్).. కేరళ నుండి 24 కోట్లు (53 కోట్ల గ్రాస్).. తక్కిన భారతదేశం నుండి 238 కోట్ల షేర్ (605 కోట్ల గ్రాస్‌) వసూలు చేసిందీ సినిమా. ఇక అమెరికాలో 80 కోట్ల షేర్ (124 కోట్ల గ్రాస్).. తక్కిన వరల్డ్ బాక్సాఫీస్ నుండి 53+ కోట్ల షేర్ (100 కోట్ల షుమారు గ్రాస్) వసూలు చేసి.. మొత్తంగా 668+ కోట్ల షేర్ రాబట్టింది. అంటే ఆల్రెడీ 1340 కోట్ల గ్రాస్ వచ్చేసింది కాబట్టి.. 4వ వారం పూర్తయ్యే సరికి.. 1500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టే ఛాన్సుంది.

ఇప్పటికే భారతదేశంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్.. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ తెలుగు హిట్.. తమిళనాడు అండ్ కేరళ కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బాహుబలి 2. ఇప్పటివరకు 800 కోట్లు దాటి వసూలు చేసి తొలి ఇండియిన ఫిలిం బాహుబలి 2 అనే చెప్పాలి. సింప్లీ.. సాహో రాజమౌళి!!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News