600 కోట్లు వస్తేనే బాహుబలి 2 సేఫ్‌

Update: 2016-08-06 11:30 GMT
బాహుబలి 2 ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్మేశారని ఆల్రెడీ చెప్పుకున్నాం. చూస్తుంటే బాహుబలిః ది కంక్లూజన్ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ రేంజుకు వెళిపోయిందని ఇట్టే అర్ధమవుతోంది. అయితే ముందు అనుకున్నట్లు అతి తక్కువ రేట్లకు ఈ సీక్వెల్ ను అమ్మనేలేదు. అసలు ఈ ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఇప్పటికే మలయాళం రైట్లను 10 కోట్లకు అమ్మిన బాహుబలి 2 ప్రొడ్యూసర్లు.. ఇప్పడు తమిళ వర్ రైట్స్ మరియు ఓవర్సీస్ రైట్లను (తెలుగు - తమిళ్‌ - మలయాళం) కలిపి ఏకంగా 87 కోట్లకు అమ్మారట. ఈ డీల్ అటూ ఇటూ కలిపి ఒక 100 కోట్లు వరకు అయ్యిందంటున్నారు. దీని తరువాత హిందీలో సినిమా ధియేట్రికల్ రైట్స్ ను కరణ్‌ జోహార్ మరియు ఏ.ఏ.ఫిలింస్ వారు కలసి 120 కోట్లకు కొన్నారట. తెలుగు రైట్లతో కలుపుకుంటే.. షుమారు 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోయింది. అంటే ఈ మొత్తం వసూలు అవ్వాలంటే దాదాపు 600 కోట్లు గ్రాస్ కలక్షన్ రావాల్సిందే. అప్పుడే బయ్యర్లు సేఫ్‌. చూస్తుంటే బాహుబలి 1 కంటే పెద్ద హిట్ అయితేనే బాహుబలి 2 కి ప్రాఫిట్స్ వచ్చేలా ఉన్నాయి.

ఏప్రియల్ 28న బాహుబలిః ది కంక్లూజన్ వరల్డ్ వైట్ రిలీజవ్వనున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News