పవన్, మహేష్, జక్కన్న సినిమాలే పెండింగ్

Update: 2016-01-29 07:38 GMT
టాలీవుడ్ ఇప్పుడు మంచి బూమ్ లో ఉంది. లోకల్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ తెలుగు సినిమాలు కుమ్మేస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఈ ఊపు మరింతగా పెరిగింది. దీనికి కారణం ఈ ఏఢాది సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడమే అని చెప్పాలి. పొంగల్ పండక్కి నాలుగు సినిమాలు రిలీజయ్యి.. అందులో మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక్కడ నాలుగు మూవీస్ వసూళ్లు రాబట్టినా.. అమెరికా మార్కెట్లో డిక్టేటర్ బయ్యర్ కి భారీ నష్టాలు వచ్చాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నేను శైలజ కూడా మంచి సక్సెస్ నే సాధించింది.

దీంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కి పోటీ పెరిగింది. రాబోయే సినిమాల్లో కాసింత అంచనాలు ఉన్న అన్నింటికీ ఎంక్వైరీలు పెరిగిపోయాయి. ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు మినహాయించి, దాదాపు సెట్స్ పై ఉన్న అన్నింటికి డీల్స్ క్లోజ్ అయిపోవడం విశేషం. ఇప్పటికైతే రాజమౌళి తీస్తున్న బాహుబలి ది కంక్లూజన్ - సూపర్ స్టార్ మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం - పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లు మాత్రమే ఇంకా డీల్ ఫైనల్ కాలేదు. వీటిలో బాహుబలి రిలీజ్ అయ్యేందుకు టైం చాలా ఉండడంతో, మేకర్స్ కానీ బయ్యర్స్ కానీ తొందరపడ్డం లేదు.

కానీ మహేష్ - పవన్ సినిమాలకు రేటు ఎక్కువగా చెబుతుండడంతో రైట్స్ అమ్మకం లేట్ అవుతోంది. పవన్ సర్దార్ కి 11 రేట్లు అడుగుతున్నారని - మహేష్ బ్రహ్మోత్సవానికి 13 కోట్లు చెబుతున్నారని తెలుస్తోంది. ఇంకా రిలీజ్ కి టైం ఉండడంతో.. ప్రస్తుతానికి  బేరాలు జరుగుతున్నాయి.
Tags:    

Similar News