శంకర్ ను కొట్టేసిన రాజమౌళి

Update: 2017-05-16 09:33 GMT
మన సినిమా మన దగ్గర వసూళ్ల మోత మోగించడం కంటే.. వేరే చోట హవా సాగిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ తెలుగు ప్రేక్షకులకు అలాంటి అనుభూతినే ఇస్తోంది. భాష.. ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల పరంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రతి భాషలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పే దిశగా అడుగులేస్తోంది.

మా సినిమానే గొప్ప అని బాగా ఫీలయ్యే తమిళనాడులో ‘బాహుబలి-2’ సాధించిన వసూళ్లు చూసి అక్కడి ట్రేడ్ పండిట్లు ముక్కున వేలేసుకుంటారు. రజినీకాంత్ లాంటి హీరో.. శంకర్ లాంటి డైరెక్టర్ కూడా మన ప్రభాస్.. రాజమౌళిల ముందు నిలవలేకపోతున్నారు. శంకర్-రజినీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రోబో’ కలెక్షన్లను ‘బాహుబలి-2’ దాటేస్తుండటం విశేషం. అత్యంత వేగంగా తమిళనాట 100 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించిన సినిమాగా ‘రోబో’ పేరిట ఉన్న రికార్డును ‘బాహుబలి-2’ బద్దలు కొట్టేసింది.

16 రోజుల్లోనే రాజమౌళి సినిమా ఈ ఘనతను అందుకుంది. ఫుల్ రన్లో తమిళనాట అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ ‘బాహుబలి-2’ నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ షేర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం రోబో.. తెరి సినిమాలు ‘బాహుబలి-2’ కన్నా ముందున్నాయి. ఐతే అవి పన్ను మినహాయింపుతో రిలీజైన సినిమాలు. డబ్బింగ్ సినిమా కాబట్టి ‘బాహుబలి-2’కు ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ఈ సినిమా ఫుల్ రన్లో ఆ రెండు సినిమాల షేర్ ను దాటేస్తే ఆశ్చర్యమేమీ లేదంటున్నారు విశ్లేషకులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News