బాహుబలి ది కంక్లూజన్.. ఈ మూవీ గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. బాహుబలి మొదటి భాగానికి ధైర్యం చేసి భారీ రేట్లు ఇచ్చి కొన్న అందరూ.. బాగా లాభపడ్డారు. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ కుమ్మేసిన జక్కన్న సినిమా.. రికార్డుల మోత మోగించింది. దీంతో ఇప్పుడు రెండో భాగానికి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. చాలాకాలంగా రైట్స్ కోసం టాక్ నడుస్తున్నా.. ఇప్పుడో ప్రధానమైన డీల్ కి సంబంధించిన డీటైల్స్ బైటకొచ్చాయి.
బాహుబలి ది కంక్లూజన్ ఓవర్సీస్ రైట్స్ సేల్ అయిపోయాయి. తమిళ్ వెర్షన్ కి శాటిలైట్ మినహా థియేట్రికల్ హక్కులు.. తెలుగు-తమిళ్-మలయాళ వెర్షన్లకు ఓవర్సీస్ రైట్స్.. మొత్తం కలిపి హోల్ సేల్ గా కే.ఎంటర్టెయిన్మెట్ కి చెందిన రాజా రత్నం కొనేశాడు. ఈ డీల్ విలువ ఎంతో తెలుసా.. 87 కోట్ల రూపాయలు. ఇందులో దాదాపు సగం మొత్తం.. అంటే 42 కోట్లకు ఇప్పటికే ఓవర్సీస్ హక్కులు అమ్మాలంటూ ఆఫర్స్ కూడా రాజరత్నం దగ్గరకు వచ్చాయి. వీటిని తోసిపుచ్చిన ఆయన.. అంతకంటే ఎక్కువగానే ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఏ యాంగిల్ లో చూసినా.. బాహుబలి 2కి వచ్చిన రేటు చాలా ఎక్కువ. ఎందుకంటే బాహుబలి ఓవర్సీస్ లో వసూలు చేసిన మొత్తం 7 మిలియన్లు. ప్రస్తుతం అమ్మిన రేటు ప్రకారం చూసుకుంటే.. కనీసం 12 మిలియన్లు వసూలు చేయాలి. అసలు విషయం మరోటి చెప్పుకోవాలి. ఈ రాజారత్నం బాహుబలి2 హక్కుల కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు ముందే ఉన్నా.. ఈ మధ్య వెనక్కి తగ్గాడనే రూమర్స్ బయల్దేరాయి. కానీ ఇప్పటికే 20 కోట్లు అడ్వాన్స్ ఇఛ్చేసి ఫైనల్ చేసేసుకున్నాడట. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని సమాచారం.