మరో రెండు రోజుల్లో బాహుబలి2 ధియేటర్లలోకి వచ్చేస్తోంది. దాదాపు 8000 స్ర్కీన్లలో సినిమా రిలీజవుతోందని బాహుబలి వర్గాలు చెబుతున్నాయి. ఈ స్ర్కీన్ల సంఖ్య అలా ఉంచితే.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే.. కొనుక్కున్న పంపిణీదారులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడతన్నాయ్ అంతే. ఎందుకంటే ఈ సినిమా అందుకోవాల్సిన ఫైనల్ కలక్షన్ దిమ్మతిరిగిపోయే రేంజులో ఉంది.
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 130+ కోట్లకు అమ్మేయగా.. ప్రపంచం మొత్తంగా 350+ కోట్లకు అమ్మేశారు. ఇక మిగిలిన డిజిటల్... నాన్ ట్రేడింగ్ రైట్లన్నీ కలుపుకుని.. నిర్మాతలు దాదాపు 500 కోట్ల వరకు వెనకేశారనే టాక్ వినిపిస్తోంది. అదంతా ఒకెత్తయితే.. దాదాపు 350 కోట్లు వసూలు చేయాలంటే మాత్రం.. బాహుబలి 2 సినిమాకు తొలిరోజునే తొలి ఆట పూర్తయ్యే నాటికే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేయాలి. అలా వస్తేనే సినిమా సక్సెస్ఫుల్ గా రెండు వారాలైనా ఆడుతుంది.. అప్పుడే కలక్షన్లు అన్నేసి కోట్లను తెస్తాయి. అయితే ఇదంతా జరిగే పనేనా అని డిస్ర్టిబ్యూటర్లు సందేహ పడుతున్నారు. ఎందుకంటారా?
నిజానికి బాహుబలి 1 సమయంలో రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ.. రోజుకో కొత్త న్యూస్ చెబుతూ.. దాదాపు ఒక నెల ముందు నుండి ప్రమోషన్లు మొదలెట్టేసి నానా హంగామా చేశారు. హీరోయిజం ఒకెత్తయితే తమన్నా గ్లామర్ కూడా మరో ఎత్తుగా నిలబడింది. కాని ఇప్పుడు బాహుబలి 2 సినిమా విషయంలో అలాంటివేం లేవు. మూకుమ్మడిగా రాజమౌళి అండ్ గ్యాంగ్ ప్రమోట్ చేయడం తప్పిస్తే.. అదికూడా నేషనల్ టెలివిజన్ లో ఎక్కువగా తెలుగు మీడియాలో తక్కువగా చేస్తున్నారు. దీనికారణంగా 1వ పార్టు రిలీజ్ టైములో ఉన్న హైప్ ఇప్పుడు కనిపించట్లేదు. అందుకే పంపిణీదారులు భయపడుతున్నారట. భారీ రేట్లకు కొనడం దేనికి ఇప్పుడు హైరానా పడటం దేనికి?!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/