5 రోజుల్లో.. 367+ షేర్.. 700+ గ్రాస్‌

Update: 2017-05-04 04:12 GMT
ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటే ఆలోచన. ఫిలిం ఇండస్ట్రీ వర్గాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న విషయం కూడా అదే. బాహుబలి2 కలెక్షన్స్ కు అసలు బ్రేక్ పడుతుందా.. అసలీ మూవీ ఎక్కడ ఆగుతుంది.. దీన్ని ఆపగలిగే సినిమా ఉందా.. ఇలాంటి డౌట్స్ చాలామందికే ఉన్నాయి.

బాహుబలి2 సాధిస్తున్న కలెక్షన్స్ చూస్తే.. ఈ అనుమానాలు తలెత్తడంలో తప్పేమీ లేదని అనిపిస్తుంది. విడుదలైనప్పటి నుంచి ఐదంటే ఐదు రోజుల్లో 367 కోట్లకు పైగా షేర్.. 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను సాధించింది బాహుబలి2. ఆంధ్రాలో 54.4 కోట్లు.. సీడెడ్ లో 17.4 కోట్లు.. నైజాంలో 28.4 కోట్లను వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఇఫ్పటి వరకూ 100.24 కోట్ల షేర్ రావడం సాధారణ విషయం కాదు. కర్నాటక 25.5 కోట్లు.. తమిళ నాడు 28.47 కోట్లు.. కేరళ 13.03 కోట్లు వసూలవగా.. దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి 110 కోట్లు వచ్చి పడ్డాయి.

యూఎస్ ఏ నుంచి 51.48 కోట్ల షేర్ ను బాహుబలి రాబట్టింది. రెస్టాఫ్ ది వరల్డ్ 38.7 కోట్లను ఇప్పటికే పిండేసింది. మొత్తం 367.42 కోట్ల షేర్ వసూలవగా.. గ్రాస్ లెక్క 703.4 కోట్ల రూపాయలు. దేశంలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డ్ ను ఇప్పటికే ఖాతాలో వేసేసుకున్న బాహుబలి2 ముందు.. ఇప్పుడు పీకే వసూలు చేసిన అత్యధిక గ్రాస్ ఒక్కటే ఉంది. దీన్ని కూడా ఆరో రోజునే బాహుబలి2 దాటేయనుండగా.. 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం సునాయాసంగా అధిగమించేయడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News