బాహుబ‌లి టీవీ సిరీస్ మ‌న‌కు కాదా?

Update: 2017-05-05 16:26 GMT
‘బాహుబ‌లి’ సినిమాను దేశ‌మంతా ఓన్ చేసుకుంది. బాహుబ‌లి-2 ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఐతే ఈ ప్ర‌భంజ‌నానికి నాంది ప‌డింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ సినిమా శ్రీకారం చుట్టుకుంది తెలుగులో. ‘బాహుబ‌లి’కి సంబంధించి ఇంకే ఆలోచ‌న అయినా ఇక్క‌డి నుంచే మొద‌ల‌వుతుంద‌ని అనుకుంటాం. కానీ ‘బాహుబ‌లి’ ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తూ నిర్మాత‌లు మొద‌లు పెట్టాల‌నుకున్న టీవీ సిరీస్ మాత్రం తెలుగులో శ్రీకారం చుట్టుకోద‌ట‌. టీవీ సిరీస్ ను ముందు హిందీలో తీసి.. ఆ త‌ర్వాత తెలుగు స‌హా మిగ‌తా భాష‌ల్లో అనువాదం చేస్తార‌ట‌. అంటే హిందీ సినిమాల్ని.. సీరియ‌ళ్ల‌ను అనువాదం చేసిన‌ట్లే దీన్నీ చేస్తార‌న్నమాట‌.

మ‌రి ఇలా అనువాదం చేసిన టీవీ సిరీస్ ఎపిసోడ్ల‌ను మ‌న‌వాళ్లు ఎంత‌మాత్రం రిసీవ్ చేసుకుంటారో మ‌రి. బాహుబ‌లిని హిందీ వాళ్లు ఎంత ఓన్ చేసుకున్న‌ప్ప‌టికీ టీవీ సిరీస్ ను నేరుగా హిందీలో మొద‌లుపెట్టాల‌నుకోవ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు రుచించ‌ని విష‌య‌మే. మ‌రి త‌న ‘బాహుబ‌లి ప్ర‌యాణం ముగిసింద‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించేసిన నేప‌థ్యంలో టీవీ సిరీస్ ను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారు.. ఎలా తీర్చిదిద్దుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. టీవీ సిరీస్ కోసం రామోజీ ఫిలిం సిటీలోని మాహిష్మ‌తి సెట్టింగ్స్ ను అలాగే ఉప‌యోగించుకోనున్నారు. ఆ సెట్టింగ్స్ మొత్తాన్ని లీజుకు తీసుకుంటున్నార‌ట నిర్మాత‌లు. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News