ఆ మధ్య ‘బాహుబలి: ది కంక్లూజన్’ క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైనపుడు చాలా హడావుడి కనిపించింది. స్వయంగా రాజమౌళి ఆ విశేషాల్ని అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపించాడు. క్లైమాక్స్ షూటింగ్ తొలి రోజు ఉదయం అప్ డేట్ ఇచ్చాడు. సాయంత్రం కూడా విశేషాలు పంచుకున్నాడు. ఐతే ప్రమోషన్ మరీ ఎక్కువైతే కష్టమనుకున్నారో ఏమో.. ఆ తర్వాత సైలెంటైపోయాడు రాజమౌళి. ఇంకెవరూ కూడా షూటింగ్ అప్ డేట్స్ పంచుకోలేదు.
ఐతే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బాహుబలి ఆన్ లొకేషన్ ఫొటోలు బయటికి వచ్చాయి. ఐతే ఇవి సినిమా మెజారిటీ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటున్న రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినవి కావు. రాయలసీమలోని ఓ క్వారిటీ షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫొటోలు. భారీగా నిల్వ ఉన్న క్వారీ గుట్టల మధ్య షూటింగ్ చేస్తోంది బాహుబలి టీం.
ఇక్కడ ఏం సన్నివేశాలు తీస్తున్నారో.. ఎవరెవరు షూటింగ్ లో పాల్గొంటున్నారో క్లారిటీ లేదు కానీ.. జనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నారు. అక్కడే ఓ పెద్ద నీటి తొట్టి కూడా కట్టించారు. ఎక్విప్ మెంట్ అదీ భారీ స్థాయిలోనే కనిపిస్తోంది. ఇంకో రెండు నెలల్లోనే బాహుబలి-2 టాకీ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత ఐదు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. 2017 ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయాలన్నది ప్లాన్.