బాహుబ‌లి-2 నైజాం డీల్ ఓకే

Update: 2016-10-11 05:28 GMT
ఇంకా ‘బాహుబ‌లి-2’ విడుద‌ల‌కు ఏడు నెల‌ల స‌మ‌యం ఉంది. ఈలోపే అనూహ్య‌మైన రేట్ల‌కు సినిమాను అమ్మేస్తున్నారు. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బిజినెస్ క్లోజ్ అయిపోతోంది. ఇటీవ‌లే ఓవ‌ర్సీస్ రైట్స్  సెటిల్ చేసిన నిర్మాత‌లు తాజాగా నైజాం డీల్ పూర్తి చేశారు. ‘బాహుబ‌లి-2’ నైజాం హ‌క్కుల్ని ఏషియ‌న్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. హైద‌రాబాద్ స‌హా కొన్ని న‌గ‌రాల్లో ఏషియ‌న్ ఫిలిమ్స్ వాళ్ల‌కు మ‌ల్టీప్లెక్సులున్నాయి.  ఈ సంస్థ అధినేత‌లు సునీల్ నారంగ్.. నారాయ‌ణ్ దాస్ ల‌కు ‘బాహుబ‌లి-2’ డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ క‌ట్ట‌బెట్టిన‌ట్లు అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ పేజీలోనే అధికారికంగా ప్ర‌క‌టించింది బాహుబ‌లి బృందం.

మిగ‌తా ఏరియాల్లో మాదిరే నైజాంలోనూ ‘బాహుబ‌లి-2’ హ‌క్కులు అనూహ్య‌మైన ధ‌రే ప‌లికిన‌ట్లు స‌మాచారం. ఆ మొత్తం రూ.45 కోట్లు అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘బాహుబ‌లిః ది బిగినింగ్’ హ‌క్కుల్ని దిల్ రాజు రూ.25 కోట్ల‌కు సొంతం చేసుకున్నారు. అప్ప‌ట్లో ఆ మొత్తం చూసి ఔరా అనుకున్నారు. అది చాలా పెద్ద రిస్క్ అన్నారు. కానీ ఈ చిత్రం నైజాంలోనే రూ.43 కోట్ల దాకా షేర్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి దిల్ రాజు రెండో పార్ట్ విష‌యంలో పోటీలో ఎలా వెనుక‌బ‌డ్డాడో ఏమో తెలియ‌దు. ఆయ‌న అనుకున్న ధ‌ర‌ను మించి ఏషియ‌న్ పిలిమ్స్ వాళ్లు కోట్ చేయ‌డంతో వారికే హ‌క్కులు క‌ట్ట‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News