వావ్!! ఆరుబయట అమరేంద్ర బాహుబలి

Update: 2017-06-09 07:29 GMT
బాహుబలి ప్రపంచ జైత్రయాత్ర చేస్తున్నాడు. మన దేశంలో రికార్డులు కలెక్షన్లు కొల్లగొట్టిన తరువాత ఇప్పుడు అమరేంద్ర బాహుబలి వీరోచిత పోరాటాలును ప్రపంచంలో మరో పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు.

 అయన ట్రాన్సిల్వానియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలి 2 ను ప్రదర్శించారు. ఈ ఫెస్టివల్ రొమేనియా లోని క్లుజ్ నాపోకా అనే సిటీ లో ప్రతి ఏటా జరుగుతుంది. ప్రపంచంలో ఏ ములా ఉన్న మంచి సినిమా గొప్ప సాంకేతిక విలువలు ఉన్న సినిమా అయన ఇక్కడకు చేరి అంతర్జాతీయ ప్రేక్షకులు ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జక్కన్న రాజమౌళి బాహుబలి వంతు వచ్చింది. బాహుబలిని అక్కడ ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ లో చూసిన రాజమౌళి ఇలా ట్వీట్ చేశారు..  “విదేశీ నేలపై  - మనకు సంబంధం లేని జీవితాలు మధ్యన మన కథను చూస్తూ ఆనందించిన క్షణాలు ఇవి.  ఇలా ఆరుబయట జనాలు చప్పట్లు మధ్య చూస్తుంటే అమరేంద్ర బాహుబలి సాహసం వీరం మరింత కొత్తగా గొప్పగా అనిపించింది''.

రాజమౌళి ఇప్పుడు ఈ ఫెస్టివల్ టూర్ లో ఉంటూ చైనా లో బాహుబలి విడుదల పనుల్లో బిజీ గా ఉన్నారు. ఏ ఫెస్టివల్ కు  వెళ్ళిన ఏ దేశం వెళ్ళిన అంతటా ఒకే స్పందన సాహోరే  బాహుబలి అని వినిపిస్తుంది. రాజమౌళి టీమ్ పెట్టిన ఎఫర్ట్ కి ఇన్వెస్ట్ చేసిన టైమ్ కి ఇప్పుడు ఫలితాలు ప్రశంసలు అతని ముంగిట నిలిచి అతని శ్రమకు గుర్తింపుగా మిగిలితున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News