‘బాహుబలి: ది కంక్లూజన్’ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధించడం.. రికార్డుల మోత మోగించడం అంత గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇది అందరూ ఊహించిందే. కానీ హిందీలో సైతం అన్ని రికార్డుల్నీ తుడిచి పెట్టేయడం.. తమిళ.. మలయాళ భాషల్లోనూ రికార్డుల మోత మోగించడమే విశేషం. అలాగే అమెరికా.. బ్రిటన్.. యూఈఏ లాంటి చోట్ల కూడా ఇండియన్ సినిమాల కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది ‘బాహుబలి-2’. ఐతే ఇవన్నీ ఒకెత్తయితే.. మన దాయాది పాకిస్థాన్లో సైతం ఈ సినిమా అంచనాల్ని మించి ఆడేస్తుండటం విశేషం.
‘బాహుబలి’ హిందూ కల్చర్ ను ఎలివేట్ చేసే సినిమా అని.. ఈ సినిమాకు పాకిస్థాన్ లో సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమని.. ఇలా రకరకాల ప్రచారాలు నడిచాయి. ఐతే ఆ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ‘బాహుబలి: ది కంక్లూజన్’కు పాకిస్థాన్ సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా ఇటీవలే పాకిస్థాన్లో విడుదలై మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వందకు పైగా థియేటర్లలో రిలీజైన ‘బాహుబలి-2’ ఇప్పటిదాకా అక్కడ ఈ చిత్రం రూ.4.5 కోట్ల దాకా వసూళ్లు రాబట్టడం విశేషం. ఖాన్స్ సినిమాలు మాత్రమే బాగా ఆడే పాకిస్థాన్లో బాహుబలి-2 లాంటి సినిమా ఇంత వసూలు చేయడం గొప్ప విషయమే. ఫుల్ రన్లో ఈ సినిమా అక్కడ రూ.6 కోట్ల దాకా వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/