ఎప్పుడా.. మరెప్పుడా అని అందరూ ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 విడుదల మరికొద్ది గంటలకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఏళ్లకు ఏళ్ల తరబడి ఊరిస్తునన ఈ మూవీ మరికాసేపట్లో థియేటర్లలో హిట్ చేస్తున్న వేళ.. ఈ సినిమాకు సంబంధించిన అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు.. హిందీ.. ఇంగ్లిషుతో పాటు తమిళ.. కన్నడ.. మలయాళ సహా భారతీయ భాషలన్నింటిలో ఈ మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విడుదల రేంజ్ ఎంత బారీగా ఉందంటే.. మొత్తంగా 8వేల స్క్రీన్లలో బాహుబలి మూవీ వేయనున్నారు. హిందీతో సహా.. మరే బాషలోనూ బాహుబలి కారణంగా.. మరే సినిమా విడుదల కాకపోవటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. బాహుబలి టీంకు షాకిస్తూ.. తమిళ వెర్షన్ కు సంబంధించిన ఒకటిన్నర నిమిషం మూవీ లీక్ అయిపోయినట్లుగా చెబుతున్నారు. నిజానికి బాహుబలి మూవీ లీక్ అయినట్లుగా వార్తలు వస్తున్న వేళ.. ఆ మాటల్లో నిజం లేదని బాహుబలి నిర్మాతలు స్పష్టం చేస్తున్న వేళ.. ఆన్ లైన్లో ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న తమిళ వెర్షన్ క్లిప్ ఒకటి హడావుడి చేయటంతో కలకలం రేగుతోంది. నిర్మాతల మాటలకు భిన్నంగా..తమిళ క్లిప్ ఒకటి ఆన్ లైన్లో దర్శనమివ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/