ఈ రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ యూట్యూబ్ లో ప్రకంపనలు రేపుతుందని అందరికీ తెలుసు. యూట్యూబ్ లో తెలుగు ట్రైలర్ రికార్డులన్నీ ‘ది కంక్లూజన్’ ట్రైలర్ ధాటికి తుడిచిపెట్టుకుపోతాయనీ తెలుసు. ఊహించని వేగంతో ఈ ట్రైలర్ మిలియన్.. 5 మిలియన్.. 10 మిలియన్ మార్కును అందుకుంటుందనీ తెలుసు. కానీ మరీ ఇంత వేగంతో రికార్డులు బద్దలవుతాయని ఎవ్వరూ ఊహించలేదు.
కేవలం ఏడంటే ఏడు గంటల్లో ‘బాముబలి: ది కంక్లూజన్’ తెలుగు ట్రైలర్ ఏకంగా కోటికి పైగా వ్యూస్ తెచ్చుకుని సంచలనం సృష్టించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ట్రైలర్ విడుదలైతే.. సాయంత్రం 5 గంటలు దాటిన కొన్ని నిమిషాలకే 10 మిలియన్ వ్యూస్ పూర్తయ్యాయి. లైక్స్ విషయంలోనూ రికార్డుల మోత మోగింది. ఏకంగా ఇప్పటికే 3.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ‘కాటమరాయుడు’ టీజర్ ఒక్కటే టాలీవుడ్లో కోటి వ్యూస్ పూర్తి చేసుకుంది. తెలుగు టీజర్.. ట్రైలర్లలో ఇదే రికార్డు. ఐతే కాటమరాయుడు టీజర్ ఆ మార్కును అందుకోవడానికి దాదాపు నెల రోజులు పట్టింది. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ కేవలం 7 గంటల్లోనే ఆ మార్కును అందుకుంది. హిందీ.. తమిళ.. మలయాళ ట్రైలర్లు యూట్యూబ్ లో అదరగొట్టేస్తున్నాయి. హిందీ ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ పూర్తి చేసుకోవడం విశేషం. నాలుగు భాషల ట్రైలర్లూ కలిపితే వ్యూస్ కోటి 70 లక్షలు దాటిపోవడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/