ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఆడియో వేడుకలకు సంబంధించిన పాస్‌లు కూడా ఫేక్ తయారు చేసే ముఠాలు తయారైపోయాయి. ఫేక్‌వి తయారు చేయడం, వాటిని బ్లాక్‌మార్కెట్‌లో భారీ రేటుకు అమ్మేయడం.. ఇలాంటి దందా పెరిగిపోయింది. దీనివల్ల వేదికల వద్ద పెద్ద రసాభాస అయిపోతోంది. ఫేక్ పాస్‌లు పట్టుకుని వచ్చి నిర్వాహకుల్ని దబాయించేవాళ్లు బోలెడుమంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి బాహుబలి టీమ్ రెడీ అవుతోంది.
ఇప్పటికే పైరసీ విరుగుడుకి రకరకాల ప్లాన్స్ వేసిన రాజమౌళి అండ్ టీమ్ ఇప్పుడు బాహుబలి ఆడియో పాస్‌లలో ఫేక్‌ని కనిపెట్టేందుకు ముందస్తు జాగ్రత్తలెన్నో తీసుకుంది. అసలు బాహుబలి పాస్‌లు లోకల్‌గా ఎక్కడా తయారు చేయలేదు. బెంగళూరులో తయారు చేయించారు. బార్‌కోడ్ సిస్టమ్‌ని కూడా ఎవరూ కాపీ చేయలేనంత పకడ్భందీగా వీటిని తయారు చేయించారట. ఈనెల 13న తిరుపతి తారకరామ గ్రౌండ్స్‌లో భారీగా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. తెలుగు, తమిళ్ రెండు ఆడియోల్ని ఇదే వేదికపై ఆవిష్కరిస్తున్నారు. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి.. ఇన్నసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.