ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ మరో ఘనత సాధించింది. విడుదలైన తొలి రోజు నుంచి రికార్డుల మోత మోగిస్తున్న బాహుబలి.. తాజాగా మరో మైలురాయిని దాటింది. రూ.542 కోట్లతో భారతీయ చిత్రాల్లో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘ధూమ్-3’ని దాటేసింది. ఐదో వారంలోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధిస్తున్న బాహుబలి రూ.545 కోట్లతో మూడో స్థానానికి చేరుకుంది. భజరంగి భాయిజాన్ సినిమా రాకుంటే బాహుబలికి రెండో స్థానం దక్కేది. ఐతే బాహుబలి వచ్చిన వారానికి విడుదలైన సల్మాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో మొదలై.. బాహుబలికి దీటుగా కలెక్షన్లు సాధించింది. ఎంతైనా సల్మాన్ కు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, ఓవర్సీస్ లో విపరీతమైన పాపులారిటీ ఉండటం వల్ల ఆ సినిమా ‘బాహుబలి’ని దాటేసింది.
బాహుబలి కంటే ముందు 500 కోట్ల క్లబ్ లో చేరిన ‘భజరంగి భాయిజాన్’ ప్రస్తుతం రూ.565 కోట్లతో సాగుతోంది. ఆ సినిమా రూ.600 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయి. బాహుబలికి ఆ ఘనత సాధ్యం కాకపోవచ్చు. ఐతే ఇప్పటికి సాధించిన దానితో రాజమౌళి అండ్ కో చాలా సంతృప్తిగా ఉండి ఉంటారు. బహుశా ఈ సినిమా రూ.400 కోట్ల క్లబ్ లో చేరుతుందని కూడా యూనిట్ సభ్యులు ఊహించి ఉండరేమో. తొలి రోజే రూ.60 కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ సినిమాల్లో బిగ్గెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా రికార్డు సృష్టించిన బాహుబలి.. ఆ తర్వాత ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్ల రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అయినా రూ.400 కోట్ల క్లబ్ లో చేరితే ఎక్కువనుకున్నారు కానీ... మన సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.500 కోట్ల వసూళ్లను దాటేసింది.