మళ్లీ ఇలా కొట్టే సినిమా ఎప్పుడు చూస్తాం??

Update: 2018-06-19 04:34 GMT
సినిమాలు అవార్డులు సాధించడం వేరు.. కమర్షియల్ హిట్లుగా నిలవడం వేరు. ఈ మధ్య కాలంలో ఈ రెండు కేటగిరీలు ఒకటిగా మారిపోతున్న వైనం కనిపిస్తూనే ఉంది. అయితే.. ఒకే సినిమా అనేక కేటగిరీల్లో అవార్డులు సాధించేసి.. కంప్లీట్ డామినేషన్ చూపించడం మాత్రం అరుదుగానే జరుగుతోంది.

రీసెంట్ గా జియో ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం ఇంకా ప్రత్యక్షంగా చూసే అవకాశం ప్రేక్షకులకు రాలేదు కానీ.. అవార్డుల జాబితా అయితే బైటకు వచ్చేసింది. ఈ లిస్ట్ ను పరిశీలిస్తే.. బాహుబలి2 మూవీకి ఏకంగా 8 అవార్డులు దక్కిన వైనం కనిపిస్తుంది. ఉత్తమ చిత్రంగా బాహుబలి2.. ఉత్తమ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఉత్తమ సహాయ నటుడు  దగ్గుబాటి రానా.. ఉత్తమ సహాయ నటి రమ్యకృష్ణ.. ఉత్తమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఉత్తమ పాటల రచయిత ఎంఎం కీరవాణి(దండాలయ్యా).. ఉత్తమ సినిమాటోగ్రఫీ కెకె సెంథిల్ కుమార్.. ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్,.. ఫిలిం ఫేర్ అవార్డులను దక్కించుకున్నారు.

ప్రధాన కేటగిరీల్లో అవార్డులు అన్నిటినీ దాదాపుగా బాహుబలి కైవసం చేసేసుకుందనే సంగతి అర్ధమవుతుంది. మళ్లీ అవార్డుల విషయంలో ఇంతటి డామినేషన్ చూపించే సినిమా ఎప్పుడు వస్తుందో ఇప్పుడప్పుడే చెప్పడం కష్టమేమో అనిపించక మానదు. ఇంతగా అవార్డులను క్లీన్ స్వీప్ చేసేసిన ఘనత మాత్రం జక్కన్న అండ్ టీంకు మాత్రమే దక్కుతుంది.


Tags:    

Similar News