బాహుబలి 650 కోట్లు పైగా వసూలు చేసి దేశంలోనే టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకూ తెలుగు సినిమా పరంగా ఉన్న అన్నిరికార్డుల్ని కొట్టేసింది. అయితే ఈ సినిమా బుల్లితెరపై ఉన్న రికార్డును మాత్రం చెరిపేయలేకపోయింది. ఇటీవలే మాటీవీ దసరా కానుకగా బాహుబలి చిత్రాన్ని లైవ్ చేసింది. అయితే ఆరోజు బుల్లితెరపై ఈ సినిమాని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. అదే రోజు వేరొక టీవీ చానెల్ లో వస్తున్న గంగ సినిమాకి అద్భుతమైన టీఆర్ పీ వస్తే బాహుబలికి మాత్రం తీసికట్టు అనిపించే టీఆర్ పీ వచ్చింది.
అంతేకాదు బాహుబలి బుల్లితెర టీఆర్ పీ మగధీర టీఆర్ పీ కంటే ఓ పాయింటు తక్కువే. ఆ రకంగా బాహుబలి మగధీర రికార్డును చెరిపేయలేకపోయింది. అధికారిక లెక్కల ప్రకారం.. బాహుబలి టీఆర్ పి 21.8 - మగధీర టీఆర్ పీ 22.7.. ఈ రెండిటిని మించి అక్కినేని నాగార్జున నటించిన శ్రీరామదాసు టీఆర్ పీ 24 పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉంది. అలాగే పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది టీఆర్ పీ 19 పాయింట్లు ఉంది. మొత్తానికి టాప్ 1 - 2 స్థానాల్లో బాహుబలి లేనేలేదు.
మాటీవీ లైవ్ చేసిన వాటిలో టాప్ 3 పొజిషన్ తోనే సరిపెట్టుకుంది బాహుబలి. అయితే ఇలా జరగడానికి కారణాలు విశ్లేషిస్తూ .. బాహుబలి సినిమా ప్రతి 10 నిమిషాల షోకి మరో 15 నిమిషాల ఇంటర్వ్యూ ఎపిసోడ్ లు - ఎడ్వర్ టైజ్ మెంట్లు లైవ్ చేయడమే ముప్పు తెచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఆరోజు బాహుబలి వీక్షించిన ప్రేక్షకులకు వినోదం కంటే టార్చరే ఎక్కువ ఎదురైందని వాస్తవం.