బాహుబలి బడ్జెట్ గురించి ముందు నుంచి రకరకాల వార్తలు ప్రచారమవుతూ వస్తున్నాయి. ముందేమో ఇది వంద కోట్ల బడ్జెట్ సినిమా అన్నారు. అప్పుడే జనాలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు బడ్జెట్ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. చివరికి నిర్మాతలే స్వయంగా బాహుబలి బడ్జెట్ 220 కోట్లని చెప్పేసరికి షాకయ్యారంతా. ఇప్పుడు రాజమౌళి నోటి నుంచి రూ.250 కోట్ల బడ్జెట్ అనే మాట వచ్చేసింది. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలు కూడా కనీసం రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన దాఖలాలు లేవు. అలాంటిది ఓ రీజనల్ లాంగ్వేజ్ మూవీకి రూ.250 కోట్లు పెట్టడమంటే అంత కంటే పెద్ద సాహసం మరొకటి ఉండదు.
ఐతే రాజమౌళి ఏ రిస్క్ చేసినా అందులో ఓ కాల్కులేషన్ ఉంటుంది. గతంలో తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధికంగా మగధీర సినిమాకు రూ.45 కోట్లు పెట్టించాడు జక్కన్న. అప్పటికి అది చాలా పెద్ద రిస్కే. కానీ ఆ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు బాహుబలి విషయంలోనూ జక్కన్న లెక్క పక్కాగానే ఉందని సమాచారం. లాభాల సంగతెలా ఉన్నా.. నష్టం మాత్రం రాకుండా ప్లాన్ చేసింది రాజమౌళి టీమ్.
బాహుబలి టీమ్ అంచనాల ప్రకారం.. తెలుగు వెర్షన్ రెండు పార్టులు కలిపి రూ.130-140 కోట్ల మేరకు బిజినెస్ జరగొచ్చు. హిందీ, తమిళం, మలయాళ వెర్షన్స్ కలిపి రెండు భాగాలకు రూ.90-100 కోట్ల మేర హక్కులు అమ్మొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు భాగాలు, అన్ని భాషలకు కలిపి శాటిలైట్ రైట్సే రూ.40-50 కోట్ల మధ్య పలకొచ్చని అంచనా. ఇంకా ఆడియో, యూట్యూబ్, ఆడియో ఫంక్షన్ రైట్స్ ఇతరాలన్నీ రూ.20 కోట్లకు తక్కువ పలకవని భావిస్తున్నారు. మొత్తానికి రూ.300 కోట్ల దాకా తిరిగి రావచ్చన్నది అంచనా.