ఫోటో కామెంట్ : సీక్వెల్ గెటప్స్ కావు కదా..?

Update: 2015-06-25 09:01 GMT
రాజమౌళి బాహుబలి సినిమా కోసం సినిమాలో నటించిన అందరి చేతా రకరకాల వేషాల్ వేయించారు. ప్రభాస్ ని, వీరుడిగా, రానాని రాజుగా చూపించిన రాజమౌళి నాజర్ ను బిజ్జలదేవ పాత్రలో అవిటివాడిగా మార్చేశారు. కాలకేయుడుని ఒంటికన్ను రాక్షసుడిగా చూపించి భయపెట్టారు. సినిమా వరకూ బాగానే వుంది కానీ తెరవెనుకా తన బాహుబలి బృందం చిత్ర విచిత్రంగా దర్శనమిస్తున్నారు. 

బాహుబలి సినిమా జూలై 10న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ పనులను కాసేపు పక్కన పెట్టి ఇట్స్ పార్టీ టైమ్ అంటూ సరదాగా గడిపారు. అయితే ఈ పార్టీలో ఎవరూ తమ సాధారణ రూపంలో ఈ పార్టీకి హాజరవకూడదని నియమం పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా నిర్మాత శోభు బ్యాట్ మాన్, రాజమౌళి తనయుడు హనుమాన్ గెటప్ లో, రానా, అనుష్క ఇలా అందరూ విచిత్ర రూపాలలో దర్శనమిచ్చారు. ఈ పార్టీలో రాఘవేంద్రరావు, ఆయన తనయుడు ప్రకాష్, దర్శకుడు క్రిష్ వంటి వారందరూ హాజరావ్వగా రాజమౌళి, ప్రభాస్ మాత్రం డుమ్మా కొట్టడం కొసమెరుపు. ఈ ఫొటోస్ చూసిన వారంతా బాహుబలి సీక్వెల్ గెటప్స్ కావుకదా అని కామెంట్ చేస్తున్నారు
Tags:    

Similar News