దర్శకుడు సందీప్ వంగా తన మొదటి సినిమా 'అర్జున్ రెడ్డి' తో టాలీవుడ్ సంచలనం సృష్టించినట్టే 'కబీర్ సింగ్' తో బాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు. చాలామంది బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాపై దుమ్మెత్తిపోసినా దాంతో సంబంధం లేకుండా ఈ సినిమా కలెక్షన్స్ రూ.300 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతున్నాయి. అయితే ఈమధ్య ఫిలిం కంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ విమర్శకులకు సందీప్ గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు.
దాంతో పాటుగా చెంపదెబ్బ కొట్టడం అనేది లవ్ లో ఒక భాగం అని.. లవర్స్ మధ్యలో అది సహజం అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఒక జంట మధ్యలో అలా చెంపదెబ్బ కొట్టుకునే చనువు లేకపోతే అది రియల్ లవ్ కాదేమో అన్నట్టుగా కామెంట్ చేయడంతో సందీప్ పై విమర్శలు వెల్లువెత్తాయి. సమంతా.. చిన్మయిలాంటి వారు ఈ అభిప్రాయాన్ని ఖండించారు. అసలే సందీప్ పట్ల 'కసి'గా ఉన్న బాలీవుడ్ జనాలు ఇదే అవకాశం అని రెచ్చిపోయారు. సందీప్ హింసను ప్రేరేపిస్తున్నాడని.. మహిళలపై దాడులను ప్రోత్సహిస్తున్నాడని విమర్శించారు.
ఈ విమర్శలకు స్పందించిన సందీప్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. తన కామెంట్లను వక్రీకరించారని అన్నాడు. "సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి. మీకు సినిమా నచ్చకపోతే సరే.. దట్స్ ఒకే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అది దాడి చేయడం కాదు. మీరు ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నప్పుడు.. మీ ఇద్దరి రిలేషన్ లోని ఇబ్బందిని హ్యాండిల్ చేయలేనప్పుడు.. మీలోని వరస్ట్ సైడ్ ను చూపించగలగడం అంది రిలేషన్లో భాగమే. 'మందు తాగి వచ్చి కొట్టడం' అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. అది ఇంటెన్స్ రిలేషన్ లో ఉన్న ఇద్దరి భావోద్వేగాలను వ్యక్తీకరించే స్వేచ్చ. అది అబ్బాయికైనా.. అమ్మాయికైనా. నేను ఇద్దరి తరఫున మాట్లాడాను. కానీ నేను మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు" అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో కూడా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. సందీప్ ను విమర్శించేవారు ఒకవైపు.. సమర్థించేవారు మరో వైపు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈరోజు సందీప్ ఫ్యాన్స్ #వుయ్ సపోర్ట్ సందీప్ రెడ్డి వంగా అంటూ ట్విట్టర్ లో ఒక హ్యాష్ టాగ్ ట్రెండింగ్ చేయడం గమనార్హం.