హీరోలు, హీరోయిన్లు కలిసి నటిస్తే చాలు వాళ్లు ప్రేమలో ఉన్నారట అని గాసిప్పులు పుట్టిస్తారు. ఇక బయట కనిపిస్తే అంతా అయిపోయిందని రాసేస్తారు. ఈ బాధ హీరోలు, హీరోయిన్లకు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డేటింగ్ యాప్ లు వచ్చాక హీరోలు, హీరోయిన్ల ఫొటోలనే కాదు.. వర్ధమాన నటీనటులు, సినిమాల్లో పద్ధతిగల పాత్రల్లో నటించిన వారిని కూడా వదలకుండా ఏడిపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు..
బాహుబలి 2 సినిమాలో అనుష్క వదినగా నటించిన ఆశ్రిత వేముగంటి తెలిసే ఉంటుంది. మంచి సంప్రదాయ కళాకారిణి అయిన ఈమె ఆ సినిమాలో శ్రీకృష్ణుడు పాటలో నృత్యం చేసి అలరించింది. యాత్ర సినిమాలో విజయమ్మగానూ నటించింది. సంప్రదాయ కళాకారిణి, నటి అయిన ఈమెను కూడా డేటింగ్ యాప్ లో ఎక్కించి ఆమెను ఆభాసుపాలు చేశారు కొందరు ప్రబుద్ధులు..చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను అందులో పెట్టి వికృత చర్యలకు పాల్పడ్డారు.
తాజాగా ఈమె సడెన్ గా డేటింగ్ యాప్ లో ప్రత్యక్షమైంది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఈమె ఫొటోను కొందరు మార్ఫింగ్ చేసి ఇలా డేటింగ్ యాప్ లో పెట్టారు.
దీనిపై సీరియస్ అయిన ఆశ్రిత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఆ నేరగాళ్ల కోసం పోలీసులు శోధిస్తున్నారు.