షోలే కన్నా మాకు బాహుబలే ఇష్టం

Update: 2017-08-19 10:58 GMT
రాజమౌళి డైరక్షన్లో వచ్చిన బాహుబలి2 దేశంలో ఎటువంటి ప్రభంజనం చేసిందో మనం చూశాం. బాహుబలి ఇండియా సినిమా గతిని గమనించే వడిని ఎలా మార్చి వేసిందో స్పెషల్ గా చెప్పవలిసిన పనిలేదు. దేశ సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ సినిమా ఒక జానపద దృశ్యకావ్యంగా ప్రతీ సినిమా అభిమానులకూ గుర్తిండిపోతుంది. ఈ సినిమా మన దేశంలో ఎంతటి ఘన విజయం పొందిందో విదేశాలలో కూడా అంతే విజయం సాధించింది. బాహుబలి సినిమాలో కనిపించే విజువల్స్ కి నార్త్ ఇండియా ప్రేక్షకులు అంతా ఫిదా అయి అక్కడ ఏ సినిమాకూ రానంత కలెక్షన్లు తెచ్చి పెట్టారు.  

ఈ మధ్య ఒక ప్రముఖ మీడియా హౌస్ చేసిన సర్వేలో కూడా బాహుబలి పై వాళ్ళకు ఉన్న అభిమానాన్ని చూపించారు. ఇండియాలోనే గొప్ప సినిమా గా పేరు గడించిన షోలే సినిమాను కూడా వెనకకు నెట్టి 26 శాతం వోటింగ్ తో ముందుంది బాహుబలి2 సినిమా.  ఈ సర్వే ప్రకారం  బాహుబలి 2 ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులు  ఈ సినిమాను 26 శాతం వోటింగ్ తో మొదటి స్థానం ఇచ్చారు. ఆ తరువాత స్థానం ఏమో 9 శాతం మంది షోలే సినిమాను 5 శాతం మంది అమీర్ ఖాన్ దంగల్ సినిమాను ఎన్నుకున్నారు అలానే బాహుబలి మొదటి భాగమును 6 శాతం మంది బెస్ట్ ఫిల్మ్ గా ఎన్నుకొన్నారు. ఈ సర్వేనే కాదు ఏ ఏడాది ఫిల్మ్ పై ఎటువంటి సర్వే పెట్టిన అందులో బాహుబలి కొన్ని స్థానాలు దక్కించుకోవడం ఖాయం.

2016- 2017గాను జరిపిన ఈ సర్వేలో హీరోల ఫేం విషయానికొస్తే.. ఫేమస్ హీరో విభాగంలో హింది మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరియు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 11 శాతం వోటింగ్ తో  మొదటి స్థానాన్ని పంచుకున్నారు. అలానే బాహుబలి సినిమా హీరో ప్రభాస్ 5వ స్థానంలో నిలిచాడు. ఎవర్ గ్రీన్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఫర్ ఎవర్ బెస్ట్ హీరోగా ఎన్నుకోబడ్డాడు.
Tags:    

Similar News