బాహుబ‌లితో పెట్టుకుంటే దబిడ దిబిడే

Update: 2019-12-13 10:16 GMT
బాహుబ‌లి సీన్ తిరిగి బాహుబ‌లి స్టార్ నే రిపీట్ చేయ‌లేక‌పోయాడు. బాహుబ‌లి 1..బాహుబ‌లి 2 సంచ‌ల‌నాలపై ఇంకా చ‌ర్చ సాగుతూనే ఉంది. ఆ రికార్డులు నాలుగేళ్లుగా సుస్థిరంగా ఉన్నాయి. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్.. స‌ల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి.. మోహ‌న్ లాల్.. మ‌మ్ముట్టి.. ఇలా ఎంద‌రో అగ్ర హీరోలు ప్ర‌య‌త్నించారు. కానీ బాహుబ‌లి రికార్డుల్ని మాత్రం చెరిపేయ‌లేక‌పోయారు. చివ‌రికి ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం సాహో సైతం విఫ‌ల‌మైంది.

ర‌జ‌నీ న‌టించిన 2.0 పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజై దాదాపు 600కోట్లు వ‌సూలు చేసి టాప్ 10లో నిల‌వ‌గ‌లిగింది కానీ బాహుబ‌లి రికార్డుల్ని వెన‌క్కి నెట్టేయ‌లేక‌పోయింది. ఇక అమీర్ ఖాన్ న‌టించిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్`  బాహుబ‌లి స్ఫూర్తితోనే అత్యంత భారీగా తెర‌కెక్కింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఐపు లేకుండా పోయింది. అమితాబ్ - అమీర్ లాంటి క్రేజీ స్టార్లు ఉన్నా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. షారూక్ వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేశాడు.. కానీ అన్నీ ఫెయిల్. స‌ల్మాన్ భాయ్ గ‌డిచిన రెండు మూడేళ్ల‌లో రెండు మూడు సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్నాడు. కానీ బాహుబ‌లి రికార్డుల్ని బీట్ చేయ‌లేక‌పోయాడు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి బాహుబ‌లి స్ఫూర్తి అని తొలి నుంచి చెప్పుకొచ్చింది కొణిదెల కాంపౌండ్. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్నా.. బాహుబ‌లి ఫీట్ ని రిపీట్ చేయ‌లేక‌పోయింది. హిందీ ప‌రిశ్ర‌మ స‌హా ఇరుగుపొరుగున ఫెయిలైనా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంప‌ర్ హిట్ కొట్టి ప‌రువు కాపాడింది.

మోహ‌న్ లాల్ సైతం ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టుల్ని ఎంచుకుని పాన్ ఇండియా స్టైల్లో ట్రై చేశారు. కానీ అది మ‌ల‌యాళం వ‌ర‌కూ వ‌ర్క‌వుటైనా ఇరుగు పొరుగు భాష‌ల్లో ప‌ప్పులుడ‌క‌లేదు. లేటెస్టుగా మ‌మ్ముట్టి కూడా పాన్ ఇండియా ట్రై చేసి ఫెయిల‌వ్వ‌డం చ‌ర్చ‌కొచ్చింది. కేర‌ళ పురాత‌న యుద్ధ విద్య‌లు.. హిస్ట‌రీ బేస్ చేసుకుని తెర‌కెక్కించిన `మ‌మాంగం` డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ దిశ‌గా వెళుతోంద‌ని.. చిత్ర క‌థానాయ‌కుడు మమ్ముట్టికి తీవ్ర నిరాశ‌ను మిగిల్చే చిత్ర‌మిద‌ని చెబుతున్నారు. మొద‌టి రోజు మ‌ల‌యాళంలో రికార్డులు బ్రేక్ చేసినా రెండో రోజు నుంచే టికెట్ విండో వ‌ద్ద‌ దారుణంగా విఫ‌ల‌మైంద‌ట‌. మ‌మ్ముట్టి ఏదో ఆశిస్తే.. ఊహించ‌ని రిజ‌ల్ట్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. కొంద‌రు మ‌మాంగం చిత్రాన్ని క్లాసిక్ ఎటెంప్ట్ అని పొగిడేసినా మాస్ ఆడియెన్ లో ఇరుగు పొరుగు భాష‌ల్లోకి దూసుకెళ్లడంలో విఫ‌ల‌మైంద‌ని విశ్లేషిస్తున్నారు. క‌నీసం కేర‌ళ‌లో అయినా వంద కోట్ల క్ల‌బ్ ని అందుకుని బాహుబ‌లి రేంజు అనిపించుకుంటుంద‌ని అంచ‌నా వేస్తే అది కూడా మిస్ ఫైర్ అయ్యింద‌ట‌. తెలుగులో పేరున్న నిర్మాణ సంస్థ రిలీజ్ చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని చెబుతున్నారు.


Tags:    

Similar News