"తాత తండ్రులిచ్చె తరిగెడి ఆస్తిని.. అంతలోనె వచ్చె బట్ట నెత్తి.. తలలు బోడులయిన తలపులు బోడులా.. కలము బట్ట కురియు కవిత ధార"... బట్టతలపై ఎక్కడో ఒక ఆటవెలది స్టైల్ పద్యం చదినట్టు గుర్తు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే బాలీవుడ్ ఫోకస్ అంతా ఇప్పుడు బాల్డ్ హెడ్ పైనే కాబట్టి. వచ్చే నెలలో బట్టతల థీమ్ పై తెరకెక్కిన రెండు కామెడీ ఎంటర్టైనర్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఆ రెండిటిలో ఒకటి ఆయుష్మాన్ ఖురానా సినిమా 'బాలా'. ఆయుష్మాన్ ఇప్పుడు వరస విజయాలతో ఊపులో ఉన్న హీరో కాబట్టి ఈ సినిమా ట్రైలర్ దాదాపు చాలామంది చూసే ఉంటారు. బట్టతలతో గర్ల్ ఫ్రెండ్స్ దొరక్క.. పెళ్ళి చేసుకుందామంటే సరైన జోడీ దొరక్క బాధపడే వ్యక్తి కథే ఇది. ఈ సినిమా నవంబర్ 7 న విడుదల అవుతోంది. అయితే సేమ్ థీమ్ తో బాలీవుడ్ లో మరో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పేరు 'ఉజ్డా చమన్'. ఈ సినిమాలో సన్నీ సింగ్ హీరో. ఈ హీరోకు కూడా అదే సమస్య. తలపై జుట్టు లేకపోవడంతో బాధ పడుతుంటాడు. ఇక ఆ సమస్యలతో వచ్చే కామెడీని మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమా నవంబర్ 8 న రిలీజ్ కానుంది.
ఒకే థీమ్ కాబట్టి రెండు ట్రైలర్లు కాస్త సిమిలర్ గా అనిపించే అవకాశం ఉంది. రెండు సినిమాల ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. రెండిట్లో బోల్డ్ కామెడీ కూడా ఉంది. 'ఉజ్డా చమన్' లో "పెళ్ళి లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు" అని హీరో తన నాన్నగారితో అంటాడు. "సరే ఒక ఉదాహరణ చెప్పు" అంటాడు ఫాదర్. క్షణం తడుముకోకుండా హీరో "సల్మాన్ ఖాన్" అని బదులిస్తాడు. టాపిక్ కంటిన్యూ చేస్తూ నాన్నగారు "ఆయన పరిస్థితి వేరు.. ఆయనకు (అమ్మాయిలు) దొరుకుతారు" అంటాడు. ఇక మీకు అర్థం అయినంత అర్థం చేసుకోండి! ఇలాంటి కామెడీలు రెండు సినిమాల ట్రైలర్లలో ఉన్నాయి. మరి బాక్స్ ఆఫీస్ సమరంలో ఏ సినిమాది పై చేయి అవుతుందో తెలియాలంటే మాత్రం మనం నవంబర్ రెండో వారం వరకూ వేచి చూడక తప్పదు.
Full View