మళ్ళీ బాలయ్యకు ముగ్గురేనా??

Update: 2017-08-04 11:11 GMT
ఒక్కో హీరోకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణకు ఒక సెంటిమెంట్ ఉండేది. ఆయన సినిమాల్లో ఎప్పుడైనా కూడా ముగ్గురు హీరోయిన్లను పెట్టుకుంటే మాత్రం.. ఆ సినిమా హిట్ అని అందరూ నమ్మేవారట. సమరసింహారెడ్డి సినిమాల్లో అంజలా జవేరి.. సిమ్రాన్.. సంఘవి చేశాక.. అదే తరహాలో చాలా వచ్చాయి. నరసింహనాయుడు సినిమాలో కూడా సిమ్రాన్.. ప్రీతి జాంగ్యాని.. ఆశా శైని.. అలా ముగ్గురు ఉన్నారు. అందుకే బాలయ్యకు అదొక సెంటిమెంట్ అని టాక్.

ఈ మధ్య కాలంలో ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు కాని.. ఇప్పుడు మాత్రం పూరి జగన్ సినిమాలో ముగ్గురిని రొమాన్స్ చేశాడు బాలయ్య. ఆల్రెడీ మొన్ననే శాతకర్ణిలో చేసిన శ్రీయకు మరో ఛాన్స్ ఇస్తూ.. పైసా వసూల్ సినిమా కోసం ముస్కాన్ సేథి.. కైరా దత్ అనే మరో ఇద్దరు భామలతో కూడా స్టెప్పులేశాడు ఈ నందమూరి హీరో. అయితే ఇప్పుడు పైసా వసూల్ తో ఈ మూడు సెంటిమెంట్ ను మడతెట్టేయట్లేదు.. తదుపరి సినిమాకు కూడా తీసుకెళ్తున్నాడు. బాలయ్య 102వ సినిమాలో ఆల్రెడీ నయనతారను మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఇదే సినిమాలో నటించడానికి మరో ఇద్దరు హీరోయిన్లను కూడా వెతుకుతున్నారట. అంటే సింహా తరహాలో ఇందులో కూడా నయన్ కాకుండా మరో ఇద్దరు ఉంటారనమాట.

అన్నీ బాగానే ఉన్నాయి కాని.. బాలయ్యతో గతంలో ఎప్పుడో చూపించిన మాస్ స్టయిల్ ను ఇప్పుడు కె.ఎస్.రవికుమార్ చూపించడం.. అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు హీరోలందరూ స్టయిలిష్ లుక్స్ లో రచ్చ చేస్తున్న వేళ.. బాలయ్య మాత్రం ఇలా ఎందుకు పాత తరహాలోని క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడు అనేది వారి సందేహం.


Tags:    

Similar News