ప్రస్తుత రోజుల్లో ఇద్దరి హీరోలను ఒక తెరపై చూడాలని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తారు. ఒకవేళ సినిమా వస్తే అదే అభిమానులు తమ హీరోని అవతలి హీరోకంటే తక్కువ చూపించారని తెలిసినా తట్టుకోలేరు. దీంతో మల్టి స్టారర్ సినిమా చెయ్యాలంటే టాలీవుడ్ లో హీరోలు కాస్త ఆలోచిస్తారనే చెప్పాలి. ఇక దర్శకులు కూడా ఎంతో ఆలోచించి ఇద్దరి హీరోలను సమానంగా చూపించుకుంటూ.. వెళ్లాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.
అయితే గతంలో వెంకటేష్ కుర్ర హీరోలతో స్టార్ హీరోలతో మల్టి స్టారర్ కి శ్రీకారం చుట్టాడు. మహేష్ -పవన్ కళ్యాణ్ స్టార్స్ కూడా అందుకు ఒకే చెప్పడం మంచి విషయమని చెప్పాలి. అయితే ఇప్పుడు అదే స్థాయిలోమహేష్ మరో మల్టి స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీనివాస్ చెప్పిన కథలో మహేష్ - బాలయ్య కలిసి నటించబోతున్నారని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా మహేష్ స్పైడర్ పనులన్నటిని పూర్తి చేసుకొని ఉన్న సమయంలో బోయపాటి కలిసి కొన్ని పాయింట్స్ చెప్పాడట. బాలయ్య కూడా ఇందులో ఉన్నారని కూడా చెప్పారట. అయితే మహేష్ స్పైడర్ రిలీజ్ తర్వాత ఒకసారి మళ్లీ కలుద్దామని. రిలీజ్ టెన్షన్ లో ఉన్నట్లు చెప్పడంతో బోయపాటి కూడా సరే అన్నాడని సమాచారం. ఒకవేళ ఈ కథ గనక ఒకే అయితే చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో మంచి మల్టీ స్టారర్ చిత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
మహేష్ స్పైడర్ 27న రిలీజ్ కాబోతోంది. ఇక తర్వాత అయన పూర్తిగా కొరటాల శివతో " భరత్ అనే నేను " సినిమాపై ద్రుష్టి పెట్టనున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు - అశ్విని దత్ కలిసి నిర్మిస్తున్న ఒక ఫ్యామిలీ కథలో మహేష్న టించబోతున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి ఒక వేళ బోయపాటి సినిమా మొదలు పెడితే మహేష్ వచ్చే ఏడాది ఎండింగ్ లోనే మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మాస్ దర్శకుడి ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో...