బాలయ్యా.. నీకు భలే ఓపికయ్యా

Update: 2017-09-01 11:21 GMT
నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనల్ గానే ఉంటుంది. వంద చిత్రాలలో నటించిన ఓ హీరో తన పాత్రకు పూర్తి మేకోవర్ చేసేందుకు ఇష్టపడతారా? హావభావాలు.. డైలాగ్స్.. నటన.. ఇలా అన్ని విషయాలలోనూ కొత్తదనాన్ని కోరుకుంటారా? కొత్తగా ట్రై చేయమంటూ ఓ దర్శకుడు చెబితే.. ఆ సీనియర్ హీరో వింటాడా? ఇలాంటి ప్రశ్నలకు మిగిలిన హీరోలు ఎవరు ఆ ప్లేస్ లో ఉన్నా నో అనే సమాధానమే వస్తుంది.

కానీ బాలయ్య మాత్రం.. పూరీ మార్క్ హీరో పాత్రలోకి కంప్లీట్ గా మారిపోయి చేసిన మూవీ పైసా వసూల్. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ చూస్తూ.. అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఫ్యాన్స్ సంతోషాన్ని ప్రత్యక్షంగా చూస్తూ.. వారిని మరింత ఉత్సాహపరిచేందుకు గాను.. తనే థియేటర్ కు కదిలి వెళ్లారు బాలకృష్ణ. హైద్రాబాద్ లో కుకట్ పల్లిలో ఉన్న భ్రమరాంభ థియేటర్ లో పైసా వసూల్ స్పెషల్ స్క్రీనింగ్ జరగగా.. దీనికి అటెండ్ అయ్యారు బాలయ్య. మరి తమ అభిమాన హీరో థియేటర్ లో ఉన్నాడంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఆయన దృష్టిలో పడేందుకు వీలైనంతవరకూ ప్రయత్సిస్తూనే ఉన్నారు.

థియేటర్లో స్క్రీన్ పై చల్లేందుకు తెచ్చిన పూలను.. నేరుగా బాలయ్యపైకే విసిరి తమ ఆనందాన్ని చాటుకున్నారు. అయితే.. తనపై ఎన్ని వందల పూలు పడుతున్నా.. బాలయ్య మాత్రం విసుక్కోకుండా క్యాచ్ లు పట్టుకోవడం విశేషం. ఇంత ఓపికగా ఫ్యాన్స్ అలరించడంలో బాలయ్య సాటి రారు మరెవరూ అనేయచ్చేమో!
Tags:    

Similar News