నిర్మాతలకు లాభాలు వస్తే ఎంతగా ఎదుగుతారో చెప్పలేము గాని నష్టాలూ వస్తే మాత్రం మళ్లీ కోలుకోలేని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. అలాంటి ఈ సినిమా ప్రపంచంలో సహాయం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. లాభాలు వస్తేనే ఫ్రెండ్షిప్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే రీసెంట్ సి.కళ్యాణ్ ఎప్పుడు చూడని విధంగా ఇంటిలిజెంట్ సినిమాతో భారీగా నష్టాలను చూశాడు.
దర్శకుడు వివి.వినాయక్ మీద నమ్మకం ఉంచి సాయి ధరమ్ తేజ్ తో నిర్మించిన ఆ సినిమా ఏ మాత్రం లాభాలని ఇవ్వలేకపోయింది. కనీసం సినిమా బడ్జెట్ లో సగం వసూళ్లు కూడా వెనక్కి రాలేదు. 15 కోట్లతో నిర్మిస్తే 5 కోట్ల లోపే అందాయి. దీంతో నిర్మాత సి.కళ్యాణ్ కి చాలా ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణతో జై సింహ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా కళ్యాణ్ కు లాభాలని ఇచ్చింది. అయితే ఇంటిలిజెంట్ మాత్రం నష్టాలను అందించడంతో బాలయ్య కళ్యాణ్ ని ఆదుకోవాలని అనుకుంటున్నాడట.
జై సింహ సినిమాతో వారిద్దరికీ మంచి రిలేషన్ ఏర్పడింది. అయితే వివి.వినాయక్ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వారిద్దరు కలిసి ఇప్పుడు సి.కళ్యాణ్ నిర్మాణంలో ఒక సినిమాను చేసి మళ్లీ నష్టాలను రికవర్ చెయ్యాలని ప్లాన్స్ వేస్తున్నారట. అయితే గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవరెడ్డి డిజాస్టర్ అయ్యింది. బాలయ్య కూడా ఇంతకుముందు వినాయక్ తో చేయడానికి ఇష్టమే అని పాజిటివ్ కామెంట్స్ చేశారు. మరి ఆ కాంబినేషన్ కళ్యాణ్ ని ఆదుకుంటుందో లేదో చూడాలి.