సీ.క‌ల్యాణ్ పై బాల‌య్య అస‌హ‌నం?

Update: 2018-03-27 13:37 GMT
మాస్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ ఇటీవ‌ల తెర‌కెక్కించిన‌ `ఇంటిలిజెంట్` డిజాస్ట‌ర్ అయిన సంగతి తెలిసిందే. ఇటు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు - వినాయ‌క్ ల కెరీర్ల‌లో ఆ సినిమా ఓ చేదు అనుభ‌వంగా మిగిలిపోయింది. ఆ సినిమా త‌ర్వాత వినాయ‌క్ ...మ‌రో సినిమా చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా విన‌య్ తో  ఓ సినిమా చేసేందుకు నంద‌మూరి బాల‌కృష్ణ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని...తాను ఆ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని నిర్మాత సీ.క‌ల్యాణ్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. దీంతో, ఆ ప్రాజెక్టు అఫీషియ‌ల్ గా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని అంతా భావించారు. అయితే, ఈ ప్ర‌క‌ట‌న పై బాల‌య్య బాబు అసంతృప్తిని వెలిబుచ్చిన‌ట్లు తాజాగా వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

`జై సింహా` త‌ర్వాత బాల‌య్య .... ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నుల‌తో బిబీబిజీగా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ సినిమా షెడ్యూల్ - త‌దిత‌ర వివ‌రాలు తెలుస్తాయి. అవి ఫైనల్ అయ్యాక త‌ర్వాతి సినిమా గురించి ఆలోచించాల‌ని బాల‌య్య అనుకున్నార‌ట‌. అయితే, వినాయ‌క్ - సీ.క‌ల్యాణ్ ల కాంబోలో సినిమా చేసేందుకు బాల‌య్య సూత్ర‌ప్రాయంగా మాత్ర‌మే అంగీక‌రించార‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి బాల‌య్య‌కు ఇంకా వినాయ‌క్ క‌థ చెప్ప‌లేద‌ట‌. ఆ క‌థను విన‌య్ పూర్తిగా సిద్ధం చేసుకొని బాల‌య్యతో ఫైన‌ల్ సిట్టింగ్ లో కూర్చోవాల్సి ఉంద‌ట‌. ఈ లోపే సీ.క‌ల్యాణ్ పొర‌పాటున స్టేట్ మెంట్ ఇవ్వ‌డంతో బాల‌య్య బాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ట‌.

త‌న ప్ర‌మేయం లేకుండా క‌ల్యాణ్ ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డంపై బాల‌య్య బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో బాల‌య్య నుంచి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేవ‌ర‌కు వినాయ‌క్-క‌ల్యాణ్ ల కాంబో మూవీపై స‌స్పెన్స్ త‌ప్ప‌దు.


Tags:    

Similar News